బొంభాట్ నుంచి సాంగ్ రిలీజ్‌

5 Jun, 2020 19:00 IST|Sakshi

'ఈ నగరానికి ఏమైంది' ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్సుగా న‌టించిన‌ చిత్రం "బొంభాట్‌".  సైన్స్ ఫిక్ష‌న‌ల్ ఎంట‌ర్‌టైనర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. గ‌తేడాది న‌వంబ‌ర్‌లో ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ చేతుల మీదుగా విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి స్వామి నాథ లిరిక‌ల్ వీడియో సాంగ్‌ రిలీజ్ అయింది. "బుద్ధిగా క‌ల‌గ‌న్నా.. బుజ్జిగా ఎద‌పైనా.. స‌ర్జిక‌ల్ స్ట్రైక్ ఏదో జ‌రిగిందిగా.." అంటూ ప్రియురాలి కోసం హీరో పాట పాడుతుంటే "ఓ మై గాడు.. బొంభాట్ పోర‌డు.. అంటూ ప్రేయ‌సి కూడా రాగ‌మెత్తుకుంది. (సుందరమ్మ.. కామ్రేడ్‌ భారతక్క)

క్లాసిక‌ల్‌, రామ‌జోగ‌య్య శాస్త్రి రాసిన ఈ పాట‌ను చంద‌న బాల క‌ల్యాణ్‌, కార్తీక్, హ‌రిని ఆల‌పించారు. జోష్‌.బి సంగీతం స‌మ‌కూర్చాడు. ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వ‌ర్క్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెర‌కెక్కుతోంది. రాఘ‌వేంద్ర వ‌ర్మ‌(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాస్ హ‌న్నూర్‌క‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'బొంభాట్' సినిమాను గ‌తేడాది చివ‌ర్లో విడుద‌ల చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ ప‌లు కార‌ణాల రీత్యా వాయిదా ప‌డింది. ఇంత‌లో క‌రోనా కార‌ణంగా విధించిన‌ లాక్‌డౌన్‌తో దీని విడుద‌ల మ‌రింత ఆల‌స్యం కానుంది. (నా బర్త్‌డే కేక్‌ నేనే తయారు చేసుకున్నా)

మరిన్ని వార్తలు