దూరంగా ఉంటునే ఆశీర్వదించారు

10 Apr, 2020 12:03 IST|Sakshi

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో సినిమా సెలబ్రిటీలు స్వీయ నిర్భందానికి పరిమితయ్యారు. ఇక పలువురు సినీ ప్రముఖులు ప్రజలకు కరోనాపై సూచనలు, సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా బాలీవుడ్‌ హీరోయిన్లు తమ బర్త్‌డే పార్టీని స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఖరీదైన రెస్టారెంట్లలో చాలా స్పెషల్‌గా జరుపుకుంటారు.

అయితే బాలీవుడ్‌ హీరోయిన్‌ స్వర భాస్కర్‌ బర్త్‌ డే(ఏప్రిల్‌ 9) అందుకు భిన్నంగా జరిగింది. ప్రస్తుతం స్వరభాస్కర్‌ 32వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇక ఈ సమయంలో స్వయంగా వెళ్లి విష్‌ చేసే పరిస్థితి లేకపోవటంతో స్నేహితులు, అభిమానులు స్వర భాస్కర్‌కు ఎవరి ఇంట్లో వారు ఉంటూనే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మరికొంత మంది స్నేహితులు గ్రూప్‌ వీడియో కాలింగ్‌ చేసి ఆమెకు వర్చువల్‌ బర్త్‌డే పార్టీని సెలబ్రేట్‌ చేశారు. స్వర వర్చువల్‌ బర్త్‌డే పార్టీ నాలుగు గంటలపాటు ఆటా, పాటలతో చాలా ఉల్లాసంగా కొనసాగింది.
 

దీనిపై స్పందించిన స్వర ‘లాక్‌డౌన్‌ సమయంలో వచ్చిన నా బర్త్‌ డేకు విష్ చేసిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులకు, అభిమానులకు కృతజ్ఞతలు. ఇటువంటి అద్భుతమైన సన్నిహితుల బృందం ఆశీర్వాదానికి  చాలా కృతజ్ఞతలు, అందరికీ ధన్యవాదాలు. ఏమాత్రం ఊహించని వర్చువల్‌ పార్టీని సెలబ్రేట్‌ చేయటం చాలా సరదా ఉంది. మీరు కుటుంబసభ్యుల వంటి స్నేహితులని చెప్పడానికి నాకు మాటలు చాలడం లేదు’ అని ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక 2018లో వచ్చిన ‘వీరే ది వెడ్డింగ్‌’ సినిమాలో స్వరభాస్కర్‌ నటించిన విషయం తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు