‘సుశాంత్‌ సమాధి నుంచి కూడా పోరాడుతున్నాడు’

19 Jun, 2020 13:14 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతికి నకిలీ సంతాపాలు తెలుపుతున్నారంటూ నటి స్వస్తిక ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు నకిలీ రీప్‌లను పోస్టు చేస్తున్నారని మండిపడ్డారు. అదే విధంగా సుశాంత్‌ మరణం గురించి తరచూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న మీడియా తీరును ఖండిస్తూ ఆమె  సోషల్‌ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. ‘నేను ఎప్పటికి దీనిని సహించలేను. మీడియా, సోషల్‌ మీడియాలో మాపై చేస్తున్న ఆపహస్యాన్ని సహించలేకపోతున్న. మిమ్మల్ని సంతాపం తెలపమని ఎవరూ అడగట్లేదు కదా. ఇలా ఫేక్‌ రిప్‌లు పోస్టు చేసి ఆపహస్యం చేస్తునారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  (బాలీవుడ్‌ బంధుప్రీతిపై వైరల్‌ వీడియో​)

సుశాంత్‌, నటి సంజనతో కలిసి ఉన్న ఫొటోను స్వస్తిక తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేస్తూ.. ‘సుశాంత్‌ జీవించి ఉన్నంత వరకు పోరాటం చశాడు. ఇప్పుడు సమాధి నుంచి కూడా  పోరాడుతున్నాడు. క్షమించు సుశాంత్‌. మమ్మల్ని క్షమించండి’ అంటూ రాసుకొచ్చారు. సుశాంత్‌ ఉత్తమ చిత్రాలలో ఒకటైన్‌ ‘డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి’తో పాటు ఇటీవల అతడు నటించిన‌ ‘దిల్ బెచారా’లో స్వస్తిక నటించారు. ఇంకా ఆ చిత్రం విడుదల కాలేదు. కాగా సుశాంత్‌ జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో బాలీవుడ్‌లో కొనసాగుతున్న బంధుప్రీతి (నెపొటిజమ్‌) వల్లే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడంటూ పలువురు బాలీవుడ్‌ ప్రముఖులపై సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ('సుశాంత్‌ని 7 సినిమాల్లో త‌ప్పించారు')

మరిన్ని వార్తలు