ఆత్మగౌరవం కోసం పోరాటం

12 May, 2019 03:41 IST|Sakshi
అనికారావు, ఆదిత్య అల్లూరి

ఆదిత్య అల్లూరి, అనికారావు జంటగా నటించిన చిత్రం ‘స్వయంవద’. వివేక్‌వర్మ దర్శకత్వంలో లక్ష్మి చలన చిత్ర పతాకంపై రాజా దూర్వాసుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వివేక్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘జానపద కథల్లో ఉండే నాటకీయత, వాస్తవికత మరే కథల్లో ఉండదు. అలాంటి కథల్లో ఒకదాన్ని ఎంచుకుని సినిమాటిక్‌గా మార్చాం.

ఆత్మగౌరవం కోసం స్వయంవద అనే యువతి చేసే పోరాటమే ఈ సినిమా. కామెడీ, హారర్, థ్రిల్లర్‌ అంశాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది.  హారర్‌ చిత్రాల్లో విభిన్న తరహా కథ, కథనాలతో రూపొందింది. సన్నివేశాలు ప్రేక్షకులు ఆశ్చర్యపడేలా చేస్తాయి. కథానాయిక పాత్ర ఆరు విభిన్నమైన గెటప్‌లలో కనిపిస్తుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ మా చిత్రాన్ని ఎక్కువమందికి చేరువయ్యేలా తీసుకురావాలనుకు న్నాం. అందుకు తగ్గట్టే మంచి థియేటర్స్‌ లభించాయి’’ అన్నారు.

మరిన్ని వార్తలు