ఆదిత్య అల్లూరి, అనికా రావు జంటగా లక్ష్మి చలన చిత్ర పతాకంపై వివేక్ వర్మ దర్శకత్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తోన్న చిత్రం `స్వయంవద`. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన నిర్మాత సి. కళ్యాణ్ టీజర్ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మోషన్ పోస్టర్, టీజర్ బాగున్నాయి. ఇటీవల కాలంలో హారర్ జోనర్ సినిమాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా. అలాగే ఇదే టీమ్ భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నా` అని అన్నారు. ‘స్వయం వద టీజర్ ప్రామిసింగ్ గా ఉంది. టీజర్ చూస్తుంటే మేకింగ్ బాగుందనిపిస్తోంది. కెమెరా పనితనం బాగుంది. ప్రస్తుతం హారర్ కామెడీ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. ఆ కోవలో ఈ సినిమా కూడా చక్కని విజయం సాధించాలి` అని నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్నారు.
హీరో ఆదిత్య అల్లూరి మాట్లాడుతూ.. ‘టీజర్ చూస్తే మా కష్టం కనిపిస్తుంది. దర్శక, నిర్మాతలిద్దరూ ఎక్కడా రాజీ పకుండా సినిమా చేసారు. స్టోరీ బేస్ట్ సినిమా ఇది. సీనియర్ నటులతో కలిసి పనిచేయడం మంచి ఎక్స్ పీరియన్స్‌ని ఇచ్చింది` అని అన్నారు. దర్శకుడు వివేక్ వర్మ మాట్లాడుతూ.. ‘హారర్ , థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, సస్పెన్స్ అంశాల చుట్టూ కథ నడుస్తుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఆరేళ్ల వయసున్నవారి నుంచి 60 ఏళ్ల వయసు గల వరకూ అందరూ కలిసి చూడదగ్గ సినిమా. అసభ్యకర సన్నివేశాలు ఎక్కడా ఉండవు. క్లీన్ ఎంటర్ టైనర్. కథను నమ్ముకుని చేసాం. మా ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులంతా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
ఈ చిత్రంలో అర్చనా కౌడ్లీ, పోసాని కృష్ణ మురళి, ధన్ రాజ్, సారికా రామచంద్రరావు, రాం జగన్, లోహిత్ కుమార్, ఆనంద చక్రపాణి, ఆర్తి మోహ్‌రాజ్, హిమాంశ రాజ్, ఉమాంత కల్ప, సోనీ హేమంత్ మీనన్, బెంగుళూరు శివానీ, బేబి శ్రీశేష నటిస్తున్నారు. ఈ చిత్రానికి రమణ.జీవి సంగీతాన్ని అందిస్తున్నారు.