‘బిగ్‌బాస్‌పై వాస్తవాలు వెల్లడించాలి’

3 Aug, 2019 12:57 IST|Sakshi

పంజగుట్ట: బిగ్‌బాస్‌–3లో ఎలాంటి వేధింపులు చోటుచేసుకోకపోతే షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ హీరో నాగార్జున బయటికి వచ్చి వాస్తవాలు వెల్లడించాలని జర్నలిస్టు శ్వేతారెడ్డి అన్నారు. మహిళలను వేధిస్తున్నారని, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఎంతోమంది చెబుతున్నా ఇప్పటిరకు నాగార్జున స్పందించకపోవడం సరికాదన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఓయూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కందుల మధుతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ .. జైళ్లలో అయినీ పేపర్‌ చదవవచ్చు, స్వేచ్చగా ఉండవచ్చు కానీ బిగ్‌బాస్‌లో 24 గంటలు కెమరాల నిఘాలో ఖైదీలకన్నా హీనంగా చూస్తున్నారన్నారు. డబ్బు ఆశచూపి డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకుని బెదిరించి టీఆర్‌టీ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, మహిళలను కించపరిచేలా ఉన్న ఈ షోను వెంటనే బ్యాన్‌ చేయాలన్నారు. లేని పక్షంలో విద్యార్థి, ప్రజా, మహిళా సంఘాలతో కలిసి షో జరుగుతున్న ప్రాంతాన్ని ముట్టడిస్తామన్నారు. దీనిపై నాగార్జున స్పందించకపోతే ఆయన నటించిన మన్మధుడు –2 సినిమాను ఆడనివ్వబోమని హెచ్చరించారు. సమావేశంలో ప్రేమ్‌కుమార్, వడ్డె ఎల్లయ్య, బల్లారి గోవింద్, శివ, మహమూద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు