4 Mar, 2018 12:33 IST|Sakshi
సై రా నరసింహారెడ్డి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

ఖైదీ నంబర్‌ 150తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సై రా నరసింహారెడ్డి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. తాజాగా ఈ సినిమా బిజినెస్‌కు సంబంధించిన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌ లో హల్‌చల్‌ చేస్తోంది. మెగా తనయుడు రామ్‌ చరణ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు పూర్తి స్థాయిలో షూటింగ్ మొదలవ్వకుండానే బిజినెస్‌ ప్రారంభమైందట.

సైరా  సినిమా డిజిటల్‌ రైట్స్‌ను అమేజాన్‌ ప్రైమ్‌ సంస్థ ఏకంగా 30 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్‌ నుంచి టీజర్‌, ట్రైలర్‌, మేకింగ్‌ వీడియోస్‌ ఇలా అన్నీ ఆ సంస్థకే ఇచ్చేట్టుగా ఒప్పందం చేసుకున్నారు. చిరు చారిత్రక వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌బచ్చన్‌తో పాటు జగపతి బాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు