ఫ్యాన్సీ రేటుకు ‘సైరా’ రైట్స్‌ 

27 May, 2019 18:32 IST|Sakshi

టాలీవుడ్‌లో అత్యంత భారీ ఎత్తున, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం సైరా. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా.. లేడీ సూపర్‌స్టార్‌ నయనతార, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ లాంటి సౌత్‌ స్టార్లు యాక్ట్‌ చేస్తున్న ఈ చిత్రం గురించి ఓ అప్‌డేట్‌ సిని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఇండియన్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దాదాపు అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్‌ క్యాస్టింగ్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ హిందీ డిజిటర్‌ రైట్స్‌ను ఎక్సెల్‌ సంస్థ భారీగా చెల్లించి తమ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే కేజీఎఫ్‌ను హిందీలో రిలీజ్‌ చేసి మంచి లాభాలను సొంతం చేసుకున్న ఈ సంస్థ తాజాగా సైరా హక్కులను చేజిక్కించుకుందని సమాచారం. రామ్‌చరణ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు