మెగా అభిమానులకి ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్‌

13 Aug, 2019 17:31 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సైరా’ మూవీ కోసం గతేడాదిగా మెగా ఫ్యాన్స్‌ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. చిరు గత పుట్టిన రోజున విడుదల చేసిన టీజర్‌తో అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ సినిమాతో మళ్లీ రికార్డులు బ్రేక్‌ చేస్తారని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌పై మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇస్తూ ‘సైరా’పై అంచనాలు రెట్టింపు చేస్తున్నారు.   

తాజాగా మెగా అభిమానులకు స్వాతంత్ర దినోత్సవ కానుకగా సర్ ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్‌ సిద్దమైంది. ఈ సందర్భంగా  సైరా నరసింహారెడ్డి చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నారు. బుధవారం(ఆగస్టు 14) సాయంత్రం 3:45 నిమిషాలకు సైరా మేకింగ్‌ వీడియో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. పోస్టర్‌లో చిరు లుక్‌ కూడా అదిరిపోయింది. దీంతో మెగా అభిమానులు సైరా మేకింగ్‌ వీడియో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

కాగా ఓ వైపు షూటింగ్‌ జరుగుతూ ఉండగానే డబ్బింగ్‌ పనులు మొదలుపెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు చిరు రికార్డు టైమ్‌లో తన డబ్బింగ్‌ను పూర్తి చేశారని టాక్‌. అసలే చారిత్రాత్మక చిత్రం కావడంతో.. భారీ డైలాగ్‌లు కూడా ఉంటాయని తెలిసిందే. అయినా చిరు తన డబ్బింగ్‌ను ఫుల్‌ స్పీడ్‌గా కంప్లీట్‌ చేశారని తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి వంటి స్టార్లు నటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 2న విడుదల చేసేందుకు ప్లాన్‌చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టాలీవుడ్‌ యంగ్‌ హీరోకు ఫైన్‌

పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్‌

60 కోట్ల మార్క్‌ను దాటి..

పెళ్లి వార్తలపై స్పందించిన ప్రభాస్‌

‘తను నన్నెప్పుడు అసభ్యంగా తాకలేదు’

ప్రముఖ సింగర్‌ భార్య మృతి

‘సాహో’ టీం మరో సర్‌ప్రైజ్‌

హ్యాపి బర్త్‌ డే అమ్మా..!

‘రణరంగం’ను వదిలేసిన మాస్‌ హీరో

ఏఏ 19 : తెర మీదకు మరో టైటిల్‌

‘వాల్మీకి’ టీజర్‌ రెడీ!

శివకార్తికేయన్‌ కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌

వదిలేది లేదు

నయన్‌పై కీర్తి అభిమానుల ఆగ్రహం

‘బిగ్‌బాస్‌’సీరియస్‌.. శివజ్యోతి, రోహిణిలకు షాక్‌

క్రేజీ కాంబినేషన్‌

ఎవరి సలహాలూ వినొద్దన్నారు

సినిమా గురించి ప్రేక్షకులే మాట్లాడతారు

నేనొచ్చేశా!

ఎంత ఖర్చుపెట్టినా ఆ పేరు రాదు

ట్రాప్‌లో పడేస్తారు

ఇట్స్‌ మేకప్‌ టైమ్‌

ఆమిర్‌.. సేతుపతి.. ఓ మల్టీస్టారర్‌

సమీర పాత్ర ఫుల్‌మీల్స్‌

‘నిరీక్షణ’కోసం విలన్‌గా మారిన హీరో

కంటెంట్‌ బాగుంటేనే ఆదరిస్తున్నారు: పృథ్వీ

13 ఏళ్ల తర్వాత విజయశాంతి తొలిసారిగా..

చేయి పట్టుకొని లాగింది: వైరల్‌ వీడియో

ఇస్మార్ట్‌ డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మెగా అభిమానులకి ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్‌

పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్‌

‘సాహో’ టీం మరో సర్‌ప్రైజ్‌

60 కోట్ల మార్క్‌ను దాటి..

‘తను నన్నెప్పుడు అసభ్యంగా తాకలేదు’

ప్రముఖ సింగర్‌ భార్య మృతి