‘సైరా’  సుస్మిత

29 Sep, 2019 08:10 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి తాజా చిత్రం ‘సైరా’ నరసింహారెడ్డిలో వినియోగించిన ఆభరణాలను శనివారం పార్క్‌ హయాత్‌లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో  సైరాకు స్టైలిస్ట్‌, డిజైనర్‌గా పనిచేసిన చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె రూపొందించిన ఆభరణాల డిజైన్లను అనుసరించి మంగత్‌రాయ్‌ సంస్థ జ్యువెల్లరీని రూపొందించి అందించింది. వీటినే చిరంజీవి, నయనతారలు ధరించినట్లు సుస్మిత తెలిపారు.

వర్థమాన నటి సలోనిజోషి

ఫ్యాషన్‌ సూత్ర
సంప్రదాయం, ఆధునికత మేళించిన దుస్తులు, ఆభరణాలతో పాటు పలురకాల మహిళా ఉత్పత్తులతో ఏర్పాటు చేసి ‘సూత్ర ఫ్యాషన్‌ ఎగ్జిబిషన్‌’  తాజ్‌కృష్ణా హోటల్‌లో ప్రారంభమైంది. వర్థమాన నటి సలోనిజోషి (ఫలక్‌నుమా దాస్‌ ఫేమ్‌) ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్‌ ప్రారంభించింది. పండగల సీజన్‌ పురస్కరించుకుని వైవిధ్యమైన కలెక్షన్స్‌ అందుబాటులో ఉంచామని, ఎగ్జిబిషన్‌ ఈ ఆదివారంతో ముగుస్తుందని నిర్వాహకుడు ఉమేష్‌ మద్వాన్‌ తెలిపారు.

మిస్‌ వరల్డ్‌ ఆస్ట్రేలియా టైలాకానన్‌

భాగ్యనగరంలో ఆస్ట్రేలియా అందం
మిస్‌ వరల్డ్‌ ఆస్ట్రేలియా టైలాకానన్‌ నగరంలో సందడి చేశారు. యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ అసోషియేషన్‌ (వైఈఏ) ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌ రాడిసన్‌ హోటల్‌లో ‘టిప్స్‌ ఆన్‌ హెల్త్‌ నూట్రిషన్‌ అండ్‌ ఫిట్‌నెస్‌’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టైలా.... ఫిట్‌నెస్‌, న్యూట్రిషన్‌పై పలు సలహాలు ఇచ్చారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా