అన్నయ్య పక్కన ఆ డైలాగ్‌ చాలు: పృధ్వీరాజ్‌

23 Sep, 2019 11:34 IST|Sakshi

ఇంటర్వెల్‌ బ్లాక్‌లో మాధవయ్యర్ సునామీలా విరుచుకుపడతాడు..

‘సైరా’ చిత్రంలో మాధవయ్యర్‌ క్యారెక్టర్‌ చేయడం తన పూర్వజన్మ సుకృతం భావిస్తున్నానని, సినీనటుడు, ఎస్వీబీసీ చైర్మన్‌ పృధ్వీరాజ్‌ తెలిపారు. తన సినీ జీవితంలో ఈ క్యారెక్టర్‌ ఒక్కటి చాలని, ఇంకా సినిమాలు చేయకపోయినా పరవాలేదని ఆయన ఉద్వేగంగా అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సైరా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో పృధ్వీరాజ్‌ మాట్లాడుతూ.... సినిమా ఇంటర్వెల్‌ బ్లాక్‌లో ‘అన్నయ్య’  గొప్పదనం గురించి చెప్పేటప్పుడు మాధవయ్యార్‌ సునామీలా విరుచుకుపడతాడు. ఇంత మంచి క్యారెక్టర్‌ నాకు ఇచ్చినందుకు అన్నయ్యకు జీవితాంతం రుణపడి ఉంటా. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చుకోలేను. 

ఈ సినిమాలో నాది మాధవయ్యర్ పాత్ర. నేను ఢిల్లీ నుంచి వచ్చి అన్నయ్యను కలిసినప్పుడు నాతో అన్నారు... ఈ క్యారెక్టర్‌ ఎవరికి రాసుంటే వాడే చేస్తాడురా.. డూ ఇట్‌..డూ యువర్ బెస్ట్ అని అన్నారు. ఆ అవకాశం నన్ను వరించింది. ఆ ఒక్క మాట చాలు నాకు ‘ఐ ఫీల్‌ దిస్‌ ఇజ్‌ ఆస్కార్‌ అవార్డు ఫర్‌ మీ. దట్‌ ఈజ్‌ ద పవర్‌ ఆఫ్‌ మెగాస్టార్‌’ . అన్నయ్య పక్కన పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో ఇంతకన్నా నాకు ఏం కావాలి. ఈ చిత్రం మెగా అభిమానులకు ఫుల్‌ జోష్‌. సినిమా అన్ని భాషల్లో సూపర్‌, డూపర్‌ హిట్‌ అవుతుంది. రికార్డులు బద్దలు కొట్టడానికి  కొణెదల సింహం వస్తున్నాడు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు సురేందర్‌ రెడ్డి, పరుచూరి బ్రదర్స్‌కు నా కృతజ్ఞతలు’ అని తెలిపారు. ఈ వేడుకకు హాజరైన దర్శకుడు కొరటాల శివ...తనకు ఓ క్యారెక్టర్‌ ఇవ్వాల్సిందేనంటూ పృధ్వీరాజ్‌ కోరారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా