7 Aug, 2018 10:10 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా సెట్ విషయంలో వివాదం చెలరేగిన సంగతి తెలసిందే.

రంగస్థలం సినిమా కోసం నిర్మించిన సెట్‌లో తిరిగి అనుమతులు తీసుకోకుండా సైరా షూటింగ్ చేస్తుండటంతో ఆ సెట్స్‌ను రెవెన్యూ అధికారులు కూల్చేశారు. అయితే ఈ పరిస్థితిని ముందే ఊహించిన చెర్రీ, మరో సెట్‌ను ఆగమేగాల మీద సిద్ధం చేశారట. ఇప్పటికే షూటింగ్ ఆలస్యం కావటంతో మరింత ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో మరో సెట్‌ను సిద్ధం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో కొత్త గా నిర్మిమించిన సెట్‌లో షూటింగ్ ప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది.

చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, సుధీప్‌, విజయ్‌ సేతుపతి, తమన్నాలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేదిని సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు.

చదవండి :
సైరాకి షాక్‌.. సెట్స్‌ కూల్చివేత

మరిన్ని వార్తలు