ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే ఉంటారు చిరంజీవి

2 Mar, 2020 05:34 IST|Sakshi
వీవీ వినాయక్, రామ్‌చరణ్, అల్లు అరవింద్, టి. సుబ్బరామిరెడ్డి, వినాయకరావు

– టి. సుబ్బరామిరెడ్డి

‘‘సముద్రమంత లోతున్న మంచితనం, శిఖరమంత ఎత్తున్న గొప్పతనం.. నా జీవితంలో మంచికీ చెడుకి మధ్య నిల్చున్న వ్యక్తి చిరంజీవి’’ అన్నారు దర్శకుడు రాఘవేంద్రరావు. చిరంజీవి జీవితంపై సీనియర్‌ జర్నలిస్ట్‌ వినాయకరావు రచించిన ‘మెగాస్టార్‌– ది లెజెండ్‌’ పుస్తకాన్ని ‘కళాబంధు’ టి.సుబ్బిరామిరెడ్డి ఆవిష్కరించి, దర్శకుడు రాఘవేంద్రరావుకి తొలి ప్రతిని అందజేశారు. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘హిమాలయాలంత ఎత్తుకి ఎదిగినా ఒదిగే ఉంటారు చిరంజీవి. అందుకే ఆయన 40 ఏళ్లుగా స్టార్‌గా ఉన్నారు. మరో 20 ఏళ్లు కూడా ఉంటారు’’ అన్నారు. ‘‘మొదటి 3–4 ఏళ్లే మేమిద్దరం బావ–బామ్మర్దిగా ఉన్నాం. ఆ తర్వాత స్నేహితుల్లా ప్రయాణించాం.

చిరంజీవిగారితో నాది 40ఏళ్ల ఏమోషనల్‌ జర్నీ. కష్టపడే తత్వానికి నిదర్శనం ఆయన’’ అన్నారు అల్లు అరవింద్‌. ‘‘ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి జీవితాన్ని పుస్తకంగా మలచడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. ఈ పుస్తకం వెనుక మూడేళ్ల ప్రయాణం ఉంది’’ అన్నారు  వినాయకరావు. ‘‘చిన్నతనంలో నాన్న ఎంత కష్టపడి పని చేసేవారో చూసే అవకాశం మాకు దొరికేది కాదు. ఇప్పటికీ మాకు ఏం అందించాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ పుస్తకం ద్వారా నాన్నకు మరింత దగ్గరవుతాను అనుకుంటున్నాను. వినాయకరావుగారికి మా కుటుంబం, అభిమానులందరి తరఫున ధన్యవాదాలు’’ అన్నారు రామ్‌చరణ్‌.  మురళీమోహన్, దర్శకుడు బి.గోపాల్, వీవీ వినాయక్, స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు