బిగ్‌బాస్‌ షోపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు

6 Feb, 2020 10:23 IST|Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచమైన తాప్సీ.. ఆ తరువాత బాలీవుడ్‌కు మాకాం మార్చారు. ఉత్తరాదిన వరుస హిట్లతో దూసుపోతూ అగ్రకథానాయిక జాబితాలో చేరిపోయారు. పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలనే ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ భామ తాజాగా బిగ్‌బాస్‌ రియాలిటీ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  తాప్సీ తాజా చిత్రం ‘థప్పడ్‌’కు సంబంధించిన ట్రైలర్‌ ఇటీవల  విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్యూలో బిగ్‌బాస్‌ షో గురించి మాట్లాడుతూ..  ‘ఒకప్పుడు బిగ్‌బాస్‌ షో అంటే ఎంతో ఆసక్తికరంగా ఉండేది. కానీ రాను రాను ఈ షోలో హింస పెరిగిపోతుంది. దీన్ని కుటుంబంతో కలిసి చూసేలా లేదు. ఒకరిని ఒకరు దూషించుకుంటూ, గొడవలు పెట్టుకుంటూ షోలో హింసలు సృష్టిస్తున్నారు. ప్రజలు కూడా ఇలాంటి హింసాత్మకమైన షోలను చూస్తూ ఎలా ఎంజాయ్‌ చేయగలుగుతున్నారు’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాంటి సంఘటనలను టీవీలో చూసి ఎంజాయ్‌ చేస్తున్న ప్రేక్షకులు అదే తమకు జరిగితే ఇలా ఎంజాయ్ చేస్తారా అని  ప్రశ్నించారు.

కాగా తాప్సీ ‘థప్పడ్‌’లో గృహిణిగా సంతోషకరమైన జీవితం గడుపుతున్న తరుణంలో.. భర్త అందరి ముందూ తనను కొట్టిన ఒకే ఒక్క చెంపదెబ్బతో ఎలాంటి మలుపు తీసుకుంది. అనంతరం తన ఆత్మగౌరవం... భర్త చేత క్షమాపణ చెప్పించడం కోసం చట్టప్రకారం ఆమె పోరాడిన తీరు ఇతివృత్తంగా దర్శకుడు అనుభవ్‌ సింగ్‌ సినిమాను రూపొందిచినట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. కాగా ఈ సినిమాను ఫిబ్రవరి 28న విడుదల చేయనున్నట్లు సమాచారం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా