ఫిల్మ్ ఇండస్ట్రీపై పూర్తి నమ్మకం పెట్టుకోవద్దు!

5 Jun, 2015 20:21 IST|Sakshi
ఫిల్మ్ ఇండస్ట్రీపై పూర్తి నమ్మకం పెట్టుకోవద్దు!

న్యూఢిల్లీ: చక్కటి అందంతో పాటు, మంచి అభినయం ఉన్న నటి తాప్సీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా.. మెరుగైన అవకాశాలను దక్కించుకోవడం తాప్సీ ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎవరు రావాలన్నా బ్యాక్ గ్రౌండ్ మాత్రం మెండుగా ఉండాలని అంటోంది. సాఫ్ట్ వేర్ కెరీర్ ను వదిలి మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన తాప్పీ.. తెలుగు సినిమా 'ఝుమ్మంది నాదం' తో ఫిల్మ్ ఇండస్ట్రీ ఆరంగేట్రం చేసింది.  అయితే సినీ  రంగంపై ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చే ముందు కాస్త ఆలోచించమని కొత్త వారికి సలహాలు ఇస్తోంది.

 

'సినిమాపై మోజుతో వచ్చే వారు బ్యాకప్ గా ఓ కెరీర్ ఆప్షన్ ను ఉంచుకోండి.  ఇండస్ట్రీపై పూర్తి స్థాయి నమ్మకం పెట్టుకోవద్దు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ లాంటి వారిని ఉదాహరణగా తీసుకోవద్దు.  చాలా మంది లేనిపోని ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చి అనేక రకాలైన సమస్యలను చవిచూస్తున్నారు. ఒకసారి ప్రాక్టికల్ గా  ఆలోచించండి' అంటూ తాప్పీ సినిమా ఇండస్ట్రీపై కాస్త అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ఉత్తరాది సినిమాలకు, దక్షిణాది సినిమాలకు చాలా వ్యత్యాసం ఉందని ఈ సందర్భంగా పేర్కొంది. దక్షిణాది సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ అనేది అసలు అవసరం ఉండదని.. అదే బాలీవుడ్ అయితే అవకాశాలు చేజిక్కించుకోవడం చాలా కష్టమని తాప్సీ సందర్భంగా స్పష్టం చేసింది.