భార్య... భర్తకు తల్లిగా నటిస్తే ఇలాగే అడిగామా?

24 Sep, 2019 20:26 IST|Sakshi

‘సారాంశ్‌లో అనుపమ్‌ ఖేర్‌ పాత్ర గురించి ఇలాగే ప్రశ్నించామా? నర్గిస్‌ దత్‌ ..సునీల్‌ దత్‌(వీరిద్దరు భార్యాభర్తలు)కు తల్లిగా నటించినపుడు ఈ విధంగానే స్పందించామా? జాన్‌ ట్రవోల్టా యూదు వ్యక్తిగా కనిపించినపుడు ఇదే ప్రశ్న అడిగామా? ఆమిర్‌ ఖాన్‌ త్రీ ఇడియట్స్‌ సినిమాలో కాలేజీ యువకుడిగా నటిస్తే ఇలాగే ప్రశ్నల వర్షం కురిపించామా? లేదంటే ఈ ప్రేమపూర్వకమైన విమర్శలు మాకు మాత్రమే పరిమితం చేశారా అంటూ బాలీవుడ్‌ బ్యూటీ తాప్సీ పన్ను ట్రోలర్స్‌కు కౌంటర్‌ ఇచ్చారు. ప్రతీ విషయాన్ని నెగిటివ్‌గా చూడటంలోనే ఆనందం దొరకుతుందా.. ప్రయోగాత్మక పాత్రలు పోషించే వారిని విమర్శించే నైజం రోజురోజుకు పెరిగిపోతోందా అని ఫైర్‌ అయ్యారు. ఇంతకీ ఈ ఢిల్లీ భామకు అంతగా కోపం తెప్పించిన విషయం ఏంటంటే...60 ఏళ్ల తర్వాత షూటర్స్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి వందల కొద్దీ పతకాలు అందుకున్న ప్రకాషీ తోమర్, చంద్రో తోమర్‌ జీవితాల ఆధారంగా ‘సాంద్‌ కీ ఆంఖ్‌’  అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రకాశీ తోమర్‌గా తాప్సీ నటిస్తుండగా.. భూమి ఫడ్నేకర్‌ చంద్రో తోమర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు.

ఈ క్రమంలో తాప్సీ, భూమి నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. మరికొంత మంది మాత్రం...‘ 60 ఏళ్ల బామ్మలకు బదులు తాప్సీ, భూమి వంటి మూడు పదుల వయస్సున్న ఆర్టిస్టులను ఎంపిక చేసి దర్శకుడు తప్పు చేశాడు. ఒరిజినాలిటీ మిస్సయింది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాప్సీపై నిప్పులు చెరిగే క్వీన్‌ కంగనా రనౌత్‌ సోదరి రంగోలి కూడా ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు. అదే విధంగా నైనా గుప్తా వంటి సీనియర్‌ నటీమణులు కూడా...‘ నాకు కూడా అలాగే అనిపిస్తోంది. మా వయసుకు తగ్గ పాత్రలు కూడా మాకు రాకుండా చేస్తే ఎలా. కనీసం ఇలాంటి పాత్రలకైనా మమ్మల్ని తీసుకోండి అంటూ దర్శకులకు సూచించారు. ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విమర్శలకు తాప్సీ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఇక అనురాగ్‌ కశ్యప్‌ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు తుషార్‌ హిరానందన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా దీపావళికి రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు