దీపావళి వరకు ఆగాలి

2 May, 2019 01:29 IST|Sakshi

సినిమా

‘‘సినిమాల్లో పోషించేది కేవలం పాత్రే అయినప్పటికీ కొన్నిసార్లు ఆ పాత్రలు మన మనసులో ఉండిపోతాయి’’ అంటున్నారు తాప్సీ. భూమీ ఫెడ్నేకర్, తాప్సీ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సాండ్‌కీ ఆంఖ్‌’ చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా ఆమె ఆ చిత్రానికి సంబంధించి తన మనోభావాలను వెల్లడించారు. ఆశయం ముందు వయసు ఎంత పెద్దదైనా చిన్నదే అవుతుందనే దానికి నిదర్శనంగా అరవై ఏళ్ల వయసులో షూటర్స్‌గా పతకాలు సాధించిన ధీర వనితలు ప్రకాషీ తోమర్, చంద్రో తోమర్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

అనురాగ్‌ కశ్యప్‌ నిర్మాణంలో తుషార్‌ హిరానందనీ దర్శకత్వం వహించారు. ‘‘ప్రకాషీ తోమర్‌ అనే పాత్ర ఎప్పటికీ నాలోనే ఉండిపోతుంది. టీమ్‌ అందరం కలిసి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం’’ అని తాప్సీ అన్నారు. ‘‘కొన్నిసార్లు గుడ్‌బైలు కష్టంగా ఉంటాయి. ఈ టీమ్‌కు గుడ్‌బై చెప్పడం కూడా అలాంటిదే. టీమ్‌ను బాగా మిస్‌ అవుతాను’’ అని భూమి అన్నారు. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రం విడుదల అవుతోంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా