అందుకే అక్కడ ఎక్కువగా తినను: తాప్సీ

4 Nov, 2019 16:44 IST|Sakshi

ముంబై : ఢిల్లీ నగరం చాలా ప్రత్యేకమైనదని.. అక్కడ నివసించే ప్రజలకు ప్రత్యేకమైన వ్యవహారశైలి ఉంటుందని.. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ తాప్సీ అన్నారు. దేశంలో ఉన్న చాలా నగరాలతో పోల్చుకుంటే ఢిల్లీకి చాలా ప్రత్యేకత ఉందన్నారు.  తాను కాలేజీ రోజుల్లో సినిమాలకు రాకముందు మోడలింగ్‌ చేశానని. అప్పుడు తనకు ఎక్కువగా జంక్‌ ఫుడ్‌  తినటం అలవాటని చెప్పారు. కాగా , ఢిల్లీ నుంచి ముంబైకి షిఫ్ట్‌ అయ్యాక బయట తినటం మానేశానని.. బయట తినటం లేదని చెప్పుకొచ్చారు. తన శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి బయటి ఆహారం తీసుకోవడం లేదన్నారు. ఒక వేళ తిన్నా కూడా ఢిల్లీలో లభించే ఫుడ్‌లా  రుచిగా, నాణ్యమైన ఎక్కువ కాలరీలు  లభించే ఆహారం ఇతర నగరాల్లో ఉండటం లేదని తాప్సీ పేర్కొన్నారు.  

తనను చూసి చాలా మంది.. ఢిల్లీ అమ్మాయి అని గుర్తుపడుతున్నారని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.  కాగా తాప్సీ పుట్టి, పెరిగింది ఢిల్లీ నగరమే అన్న విషయం తెలిసింది. ఢిల్లీలో పుట్టిన అమ్మాయిగా తనకు హింది భాష మీద  బలమైన పట్టు ఉందన్నారు. ఈ నగరంలో  కొన్ని సమయాల్లో ప్రతికూల విషయాలు ఇబ్బందిపెట్టినా..  ఆ విషయాలకు ఎలా దూరంగా ఉండాలో తెలుసని చెప్పారు. ఈ నగరానికి చాలా రుణపడి ఉన్నానంటూ.. కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇతర భాషల కంటే తాను హింది భాషలా చాలా స్పష్టంగా మాట్లాడుతానని, తాను మాట్లాడే విధానం , ఉచ్ఛరణ బాగుంటుందని చెప్పుకొచ్చింది ఈ ఢిల్లీ బ్యూటీ.

తాను సినిమాల్లోకి వస్తానని అనుకోలేదని, ఆసక్తి కూడా ఉండేది కాదని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు సినిమాలు చూడటానికి వెళ్లేవారు కాదని.. తాను మాత్రం కాలేజీ రోజుల్లో స్నేహితులతో చాలా తక్కువ సంఖ్యలో సినిమాలు చూశాని చెప్పారు. తాను సినిమాలు చేయటం మొదలు పెట్టినప్పుడు.. తన సహచర నటులతో పోల్చుకుంటే సినిమా పరిజ్ఞానం చాలా తక్కువని అన్నారు.  టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన.. తాప్సి  పింక్ , మిషన్ మంగల్,  నామ్ షబానా వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన తాప్సీ.. తాజాగా 60 ఏళ్ల వయసులో షూటర్స్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి కొన్ని వందల పతకాలు అందుకున్న ప్రకాషీ తోమర్, చంద్రో తోమర్‌ జీవితాల ఆధారంగా తెరకెక్కిన ‘సాంద్‌ కీ ఆంఖ్‌’ చిత్రంలో  నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు