మస్త్‌ బిజీ

22 Jul, 2018 03:41 IST|Sakshi

పగ తీర్చుకోవటానికి పక్కా ప్లాన్‌ వేశారట తాప్సీ. ఈ సీక్రెట్‌ ప్లాన్‌లో అమితాబ్‌ బచ్చన్‌కి  కూడా పార్టనర్‌షిప్‌ ఉందట. ఈ ప్లాన్‌ డీటైల్స్‌ తెలియడానికి ఇంకా టైమ్‌ ఉంది. సుజోయ్‌ ఘోష్‌ దర్శకత్వంలో తాప్సీ, అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘బద్లా’. గ్లాస్కోలో మొదలైన ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ బిజినెస్‌ ఉమెన్‌ క్యారెక్టర్‌లో తాప్సీ నటిస్తున్నారని సమాచారం. ‘పింక్‌’ సినిమా తర్వాత తాప్సీ, అమితాబ్‌ కలిసి నటిస్తోన్న చిత్రమిది. మరోవైపు అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో అభిషేక్‌ బచ్చన్, విక్కీ కుశాల్, తాప్సీ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘మన్‌మర్జియాన్‌’.

ఈ సినిమాను సెప్టెంబర్‌ 21న రిలీజ్‌ చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. తాప్సీ లాయర్‌గా నటించిన మరో హిందీ సినిమా ‘ముల్క్‌’ కూడా త్వరలో రిలీజ్‌ కానుంది. అలాగే ఆమె నటించిన తెలుగు చిత్రం ‘నీవెవరో’. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ ముఖ్య పాత్రలుగా నటించిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌ కానుంది. ఇలా ఒకవైపు షూటింగ్‌లతో మరోవైపు సినిమాల రిలీజ్‌లతో మస్త్‌ బిజీగా ఉన్నారు తాప్సీ. మొత్తానికి తాప్సీ కెరీర్‌ మూడు షూటింగులు మూడు రిలీజులు అన్నట్లుగా ఉంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది తాప్సీ ఎక్కువసార్లు స్క్రీన్‌ మీద కనిపిస్తారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు