తాప్సీ బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలిసిపోయింది

11 May, 2020 15:48 IST|Sakshi

ముంబై: తన కుటుంబానికి తన బాయ్‌ఫ్రెండ్‌ ఎవరో తెలుసని, అతడిని తన తల్లిదండ్రులు అంగీకరించినట్లు హీరోయిన్‌ తాప్సీ పన్ను వెల్లడించారు. కాగా పలుమార్లు తన ప్రేమ విషయం అడగ్గా దాటేస్తున్న వచ్చారు ఈ భామ. అయితే ఇటీవల తను ప్రేమలో ఉన్నట్లు స్పష్టం చేసినప్పటికీ అతనేవరో చెప్పకుండా సస్పెన్స్‌‌లో ఉంచారు. తాజాగా తన బాయ్‌ ఫ్రెండ్‌ను కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తూ ‌ బ్యాట్మంటన్‌ ఆటగాడైన మాథియాస్‌ బో అని పేరు చెప్పేశారు. (పెళ్లి తర్వాతే పిల్లలను కంటాను: తాప్సీ)

ఇక ఈ విషయంపై తాప్సీ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘ఒకవేళ బోతో నా ప్రేమను మా తల్లిదండ్రులు అంగీకరించకపోయుంటే తనతో నా ప్రేమకు స్వస్తి పలకాల్సి వచ్చేది. ఇక నేను ఎవరి నుంచి నా ప్రేమను దాచడానికి ఇష్టపడను. నా జీవితంలో ఒకరి ఉనికిని అంగీకరించడం చాలా గర్వంగా ఉంది. అయితే ఎప్పుడూ నేను ప్రేమలో ఉన్న విషయమే చెప్పాను కానీ బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరన్నది స్పష్టం చేయలేదని ఒప్పుకుంటాను. ఎందుకంటే నటిగా నాకంటూ ఓ గుర్తింపు వచ్చేవరకు తను ఎవరన్నది చెప్పలేకపోయా. ఎందుకంటే ఓ నటిగా నా విశ్వసనీయతకు ఇది దూరం. ఒకవేళ చెప్పుంటే గతేడాది నేను సాధించిన విజయాలు నాకు అంది ఉండేవి కావేమో’ అంటూ చెప్పుకొచ్చారు.  (ఆరోజు మళ్లీ తిరిగొస్తే బాగుండు : తాప్సీ)

అదే విధంగా ‘‘నా జీవితంలో ఎవరో ఉన్నారని నా కుటుంబానికి తెలుసు. అలాగే నేను ఇష్టపడ్డ వ్యక్తిని నా తల్లిదండ్రులు, నా సోదరిలు కూడా ఇష్టపడటం ముఖ్యం. లేకపోతే వారు అంగీకరించలేని నా ప్రేమను నేను అంగీకరించలేను’’ అని చెప్పారు. గతేడాది ఓ ఇంటర్వ్యూలో తాప్సీ సోదరి షగున్‌ మాట్లాడుతూ.. తాప్సీకి బో‌ను తానే పరిచయం చేశానని చెప్పారు. అంతేగాక తాప్సీ ఎప్పడూ తనకు కృతజ్ఞతగా ఉండాలన్నారు. తాను బో‌ను పరిచయడం వల్లే వారిద్దరు కలుసుకోగలిగారని చెప్పారు. కాగా అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో వచ్చిన ‘థప్పడ్‌’లో తాప్సీ నటించని విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇటీవల విడుదలై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇందులో తాప్సీ నటన ఎంతగానో ఆకట్టుకుందంటు అభిమానులు, బాలీవుడ్‌ ప్రముఖులు ఆమెపై ప్రశంసల జట్లు కురిపించారు. 

2 years back the day the family reunited in Mumbai to do the paath at the new apartment. Special occasions call for special gestures and spending that day in a semi ready apartment with all of us together was definitely memorable. And yes we did get the Kadha prashaad in the end 💁🏻‍♀️😁 #Throwback #QuarantinePost #Archive

A post shared by Taapsee Pannu (@taapsee) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా