ఆరోజు మళ్లీ తిరిగొస్తే బాగుండు : తాప్సీ

21 Apr, 2020 19:10 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు వాయిదా పడడంతో ఇంటికే పరిమితమైన సినీ నటులు సరదాగా గడుపుతున్నారు. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన తా​ప్సీ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నారు. తాజాగా 2018లో తాప్సీ నటించిన హిందీ చిత్రం 'మన్‌మారిజియన్‌' షూటింగ్‌ లోకేషన్‌లో తీసిన ఒక ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది. ఆ ఫోటోలో తాప్సీ ఒక వైట్‌ స్కూటీపై కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంటే ఆమె వెనకాల కెమెరామెన్‌ షూటింగ్‌కు సంబందించి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు.(అనుష్క శర్మ వెబ్‌ సిరీస్‌ టీజర్‌ విడుదల)

'ఈ ఫోటో నాకు ఎప్పటికి గుర్తుండిపోతుంది.. ఎందుకంటే ఆరోజు షూటింగ్‌ లొకేషన్‌లో ఇంకా షూటింగ్‌ స్టార్ట్‌ కాలేదు. బైక్‌పై ఉన్న నేను నా వెనకాల అసలు ఏం జరుగుతుందో పట్టించుకోలేదు. నేను ఆలోచిస్తూ కూర్చుంటే.. కెమెరామెన్లు మాత్రం నా బైక్‌పై కెమెరాలు పెట్టి వారి పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో నేను నా భావోద్వేగంతో పాటు బండి బరువును కూడా బ్యాలెన్స్‌ చేసుకున్నానా ఇప్పుడు నాకు అనిపిస్తుంది. నాకు ఆ గందరగోళం మళ్లీ తిరిగి వస్తే బాగుంటుందనిపించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఉన్నంతవరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్‌ చేస్తూ జ్ఞాపకాలను నెమరువేసుకుంటా అని తప్సీ తెలిపింది. కాగా 2018లో విడుదలైన మన్‌మారిజియన్ సినిమాను అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించగా, అభిషేక్‌ బచ్చన్‌, విక్కీ కౌషల్‌లు హీరోలుగా నటించారు.


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు