‘కరణ్‌‌ జోహార్‌‌ను అభిమానిస్తానని చెప్పలేదు’

19 Jul, 2020 17:59 IST|Sakshi

ముంబై: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్‌లో నెపోటిజం గొడవ రోజురోజుకు వేడెక్కుతోంది. ఇటీవల తాప్సీ పొన్ను, స్వరా భాస్కర్‌లను బీ గ్రేడ్‌ నటీనటులని కంగనా రనౌత్‌ విమర్శించిన విషయం తెలిసిందే. దానికి తాప్సీ కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చింది. అయితే ఇటీవల తాప్సీ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. కొందరు పరిశ్రమ గురించి ఎప్పుడు వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రస్తుతం సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే నటీనటుల తల్లిదండ్రులకు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ పరోక్షంగా కంగనా పై తాప్సీ తీవ్ర విమర్శలు గుప్పించింది.

అలాగే బాలీవుడ్‌ నిర్మాత కరన్‌జోహార్‌ను తానెప్పుడు అభిమానిస్తానని గానీ, ద్వేషిస్తానని చెప్పలేదని తెలిపింది. కానీ మీరు నిరంతరం ఓ వ్యక్తిని విమర్శిస్తున్నారంటే సదరు వ్యక్తిని అభిమానిస్తారని కంగనాను తాప్సీ కౌంటర్‌ ఇచ్చింది. కాగా తాను పాజిటివ్‌ అంశాలకే ప్రాధాన్యతనిస్తానని, ప్రతి ఒక్కరి జీవితంలో పాజిటివ్‌, నెగిటివ్‌ అంశాలుంటాయని, అందరు పాజిటివ్‌గా ఉండాలని తాప్సీ సూచించారు. (చదవండి: ఆరోజు మళ్లీ తిరిగొస్తే బాగుండు : తాప్సీ)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు