కొత్త కథలైతే విజయం ఖాయం

9 Nov, 2019 03:09 IST|Sakshi
‘తాగితే తందానా’ ఫస్ట్‌ లుక్‌

‘‘తాగితే తందానా’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఈ చిత్రనిర్మాతలు చాలా కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారు. కొత్త కాన్సెప్టులతో వస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదిత్, మధు, సప్తగిరి లుక్స్‌ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమా మంచి హిట్‌ అవ్వాలి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ఆదిత్, సప్తగిరి, మధునందన్, సిమ్రాన్‌ గుప్తా, రియా ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘తాగితే తందానా’. శ్రీనాథ్‌ బాదినేని దర్శకత్వం వహిస్తున్నారు.

రైట్‌ టర్న్‌ ఫిలిమ్స్‌ పతాకంపై వి.మహేష్, వినోద్‌ జంగపల్లి  నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి లుక్‌ని మారుతి, బ్యానర్‌ లోగోని నిర్మాత దామోదరప్రసాద్‌ విడుదల చేశారు. దామోదరప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘కొత్తవాళ్లు సరైన ప్లానింగ్‌తో వస్తే కచ్చితంగా సక్సెస్‌ అవుతారు. ఈ నిర్మాతలు పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌తో అనుకున్న టైమ్‌లో సినిమా పూర్తి చేయడంలో సక్సెస్‌ అయినట్టు తెలుస్తోంది’’ అన్నారు. ‘‘ఇప్పటివరకు నేను 16 చిత్రాలు చేశాను. వాటిలో 13 చిత్రాలు కొత్త దర్శకులతోనే చేశాను’’ అన్నారు ఆదిత్‌.

‘‘కమెడియన్‌గా మంచి చిత్రాలు వస్తే చేద్దామనుకుంటున్న తరుణంలో శ్రీనాథ్‌ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశా’’ అన్నారు సప్తగిరి. ‘‘ముగ్గురు కుర్రాళ్లు తాగిన మత్తులో ఒక సమస్యలో ఇరుక్కుంటారు.. దాని నుంచి వారు ఎలా బయటపడ్డారనేది చిత్రకథ’’ అన్నారు శ్రీనాథ్‌ బాదినేని. ‘‘అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు వినోద్‌ జంగపల్లి. చిత్రనిర్మాత వి.మహేష్, లైన్‌ ప్రొడ్యూసర్‌ అనిల్, మధునందన్, సిమ్రాన్‌ గుప్తా, రియా, సంగీత దర్శకుడు శ్రవణ్‌ భరద్వాజ్, ఎడిటర్‌ బి.నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్‌ రెడ్డి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సూపర్‌హీరో అవుతా

వాళ్లంటే జాలి

అమెరికా నుంచి రాగానే...

‘ఆయన లేకుంటే.. ఇక్కడ ఉండేవాడిని కాదు’

ఇక నుంచి కొచ్చి కాదు.. హైదరాబాద్‌లోనే

నవంబర్‌ 18న ప్రభాస్‌ ‘జాన్‌’ షూటింగ్‌

‘ఒక్క అడుగు నాతో వేస్తే చాలు’

సీఎం జగన్‌పై నారాయణమూర్తి ప్రశంసలు

మహేశ్‌ మేనల్లుడితో ‘ఇస్మార్ట్‌’బ్యూటీ

‘ట్రెండ్‌’సెట్‌ చేస్తున్న నితిన్‌, రష్మికా

అలా చేయనందుకు భారీ మొత్తం: నటి

‘నా నాలుక భాగాన్ని కత్తిరించారు’

హాలీవుడ్‌ నటుడితో పోటీపడుతున్న కఫూర్‌ ఫ్యామిలీ

బన్నీ ట్వీట్‌.. రిలీజ్‌ డేట్‌ మారినట్టేనా?

తిప్పరా మీసం : మూవీ రివ్యూ

ఆ వార్తల్ని ఖండించిన యాంకర్‌ ప్రదీప్‌

భారతీయుడు-2: కమల్‌ కొత్త స్టిల్‌!!

ఆ స్వార్థంతోనే బిగ్‌బాస్‌ షోకు వచ్చా: జాఫర్‌

శ్రీదేవి చిత్రం.. అరంగేట్రంలోనే ‘గే’ సబ్జెక్ట్‌తో

ప్రముఖ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు 

సెలూన్‌ షాప్‌లో పనిచేశా..

పూల మాటుల్లో ఏమి హాయిలే అమలా...

డబ్బే ప్రధానం కాదు

హాలీవుడ్‌ ఆహ్వానం

అప్పుడు దర్శకుడు.. ఇప్పుడు నటుడు

షూట్‌ షురూ

తీన్‌మార్‌?

మహేశ్‌ మేనల్లుడు హీరో

అరుణాచలం దర్బార్‌

యాక్టర్‌ అయినంత మాత్రాన విమర్శిస్తారా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సూపర్‌హీరో అవుతా

వాళ్లంటే జాలి

అమెరికా నుంచి రాగానే...

‘ఆయన లేకుంటే.. ఇక్కడ ఉండేవాడిని కాదు’

ఇక నుంచి కొచ్చి కాదు.. హైదరాబాద్‌లోనే

సల్మాన్‌ సినిమాలో ‘స్పైడర్‌ విలన్‌’