తారల ఇంట రక్షా బంధన్‌ వేడుకలు...

27 Aug, 2018 13:40 IST|Sakshi
తైమూర్‌ ఖాన్‌(సైఫ్‌ అలీ ఖాన్‌ కుమారుడు) - ఇనాయా నౌమి(సోహా అలీ ఖాన్‌ కుమార్తె)

తోబుట్టువులంతా జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని ప్రమాణం చేసుకునే పండగే రక్షా బంధన్‌. చిన్నారుల నుంచి పెద్దల వరకూ.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ దేశమంతటా రాఖీ వేడుకలు సంతోషంగా జరుపుకున్నారు. బాలీవుడ్‌లో కూడా రక్షా బంధన్‌ వేడుకలు బాగా జరిగాయి. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు తమ తోబుట్టువులతో కలిసి రాఖీ పండగ చేసుకున్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌ తన కూతరు ఆరాధ్యతో కలిసి రాఖీ వేడుకలు సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆరాధ్య తన తల్లితో కలసి తన ఆంటీ శ్రిమా రాయ్‌ ఇంటికి వెళ్లింది. అక్కడ ఆరాధ్య, తన ఆంటీ కుమారుడికి రాఖీ కట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను శ్రిమా రాయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అటు అభిషేక్‌ బచ్చన్‌, తన సోదరి శ్వేతా నందా బచ్చన్‌ చేత రాఖీ కట్టించుకున్నారు.

అటు పఠౌడీ కుటుంబం.. సైఫ్‌ అలీ ఖాన్‌ నివాసంలో కూడా రక్షా బంధన్‌ వేడుకలు సంతోషంగా జరిగాయి. ఈ పండుగ సందర్భంగా సైఫ్‌ నివాసం తన పిల్లలు, తన సోదరి సోహా అలీ ఖాన్‌ పిల్లలతో కళకళాడింది. రాఖీ సందర్భంగా సోహా అలీ ఖాన్‌, తన కుమార్తె ఇనాయా నౌమితో కలిసి తన అన్న సైఫ్‌ ఇంటికి వచ్చారు. అనంతరం సోహా కుమార్తె, సైఫ్‌ - కరీనాల కొడుకు తైమూర్‌ అలీ ఖాన్‌కు రాఖీ కట్టగా..  సోహా తన సొదరుడు సైఫ్‌కి రాఖీ కట్టింది. అంతేకాక సైఫ్‌ అలీ ఖాన్‌ పిల్లలు సారా, ఇబ్రహీం కూడా తన చిన్న సోదరునికి రాఖీ కట్టారు.

అయితే ఈ రక్షా బంధన్‌నాడు తైమూర్‌ రెండు చోట్ల వేడుకలు చేసుకున్నాడు. ఒకటి తన ఇంట్లో కాగా మరోటి తన పెద్దమ్మ కరిష్మా కపూర్‌ ఇంట్లో. కరిష్మా కుమార్తె సమైరా కూడా తైమూర్‌కి రాఖీ కట్టింది. పఠౌడి కుటుంబంలో వేడుకగా జరిగిన ఈ పండుగకు సంబంధించిన ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకొంటున్నాయి.

ఇటు కపూర్‌ల కుటుంబంలో కూడా రాఖీ పండుగను సంతోషంగా జరుపుకున్నారు. రక్షా బంధన్‌ సందర్భంగా జాన్వి కపూర్‌, అన్షులా కపూర్‌ తమ సోదరుడు అర్జున్‌ కపూర్‌కి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా కుటుంబం అంతా ఒక్క చోట చేరిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా