ఇంగ్లాండ్‌ బోర్డింగ్‌ స్కూల్‌కు తైమూర్‌!

8 Feb, 2020 15:51 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ కపూల్‌ కరీనా కపూర్‌- సైఫ్‌ అలీఖాన్‌ల ముద్దుల తనయుడు తైమూర్‌ అలీఖాన్‌ పుట్టినప్పటి నుంచి తరుచూ వార్తాల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇప్పటికే బోలెడంతా అభిమానులను కూడా సంపాదించుకున్నాడు ఈ స్టార్‌ కిడ్‌. ఈ పిల్లోడికి ఎంత క్రేజ్‌ ఉందంటే చిన్నప్పుడే సెలబ్రిటీగా మారిపోయాడు. తాజాగా మరోసారి తైమూర్‌ వార్తల్లో సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. తైమూర్‌ త్వరలో బోర్డింగ్‌ స్కూల్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిన్నారి ముంబైలోని ఓ పాఠశాలకు వెళ్తున్నాడు. అయితే ఇంగ్లాండులోని బోర్డింగ్‌ స్కూల్‌కు పంపించడం పటౌడీ కుటుంబంలో ఓ సంప్రదాయమని, తమ కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి తైమూర్‌ను విదేశాల్లోని ఓ బోర్డింగ్‌ స్కూల్‌కు పంపనున్నట్లు సమాచారం. (అమ్మో!.. ఆమె బ్యాగు అంత ఖరీదా!)

కాగా సైఫ్‌ తండ్రి మన్సూర్‌ అలీఖాన్‌ ఇంగ్లాండ్‌లోని బోర్డింగ్‌ స్కూల్‌లోనే చదివారు. అలాగే అతని పిల్లు సైఫ్‌, సోహా, సబా సైతం అక్కడే విద్యను అభ్యాసించారు. ఇక సైఫ్‌ అలీఖాన్‌, అమ్రితా సింగ్‌ పిల్లలు సారా, ఇబ్రహీం అలీఖాన్‌ను కూడా అక్కడే చదివించారు. దీంతో ఇప్పుడు తైమూర్‌ కూడా ఇంగ్లాండులోనే చదువుకుంటాడని అందరూ భావిస్తున్నారు. మరోవైపు తైమూర్‌ను ఇప్పుడే విదేశాలకు పంపించేందుకు సైఫ్‌, కరీనా సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే తమ గారాల పట్టిని ఇంత చిన్న వయస్సులో అంత దూరం పంపించడానికి వీరు సిద్ధంగా లేరు. తైమూర్‌ చైల్డ్‌ హుడ్‌ అంతా కుటుంబంతో గడపాలని సైఫ్‌, కరీనా కోరుకుంటున్నట్లు, ఒక నిర్ధిష్ట వయస్సు వచ్చిన తర్వాతే విదేశాలకు పంపించాలని భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.(అవునా.. కేర్‌టేకర్‌కు అంత జీతమా?!)

చదవండి : చిట్టి తమ్ముడికి హీరోయిన్‌ విషెస్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా