తైమూర్‌ ఎంత క్యూట్‌గా గుడ్‌బై చెప్పాడో తెలుసా?

22 Sep, 2018 11:53 IST|Sakshi

సెలబ్రెటీలు కావడానికి కొందరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ పుట్టుకతోనే సెలబ్రెటీ స్థాయి కొద్దిమందికి మాత్రమే వస్తుంది. పెద్ద పెద్ద సెలబ్రెటీల కంటే ఈ స్టార్‌ కిడ్‌లకే ఎక్కువ ఫాలోయింగ్‌ ఉంటోంది. ఈ జాబితాలో మొదటివరుసలో ఉండేది మాత్రం తైమూర్‌. సైఫీనా (సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌)  జంట ముద్దుల తనయుడు తైమూర్‌కు సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే.

ఈ చోటా నవాబ్‌ బయట కనిపిస్తే చాలు.. కెమెరాలన్నీ తన వైపే తిరుగుతాయి. తనతో ఫోటోలు దిగాలని ఎంతో మంది ట్రై చేస్తుంటారు. తైమూర్‌ ప్రస్తుతం ప్లే స్కూల్‌కు వెళ్తున్నాడు. తైమూర్‌ వెంట మీడియా పడకుండా ఆయా సంరక్షిస్తూ ఉంటుంది. గతంలో ఓ అభిమాని తైమూర్‌తో ఫోటో దిగాలని ఆయాతో గొడవ పడిన వీడియో కూడా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. స్కూల్‌ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు ఈ బుడ్డోడు. ఇంటి గేట్‌ ముందు ఉన్న మీడియా సిబ్బంది తైమూర్‌ను ఫోటోలు తియ్యాలని ప్రయత్నించారు. వారిని ప్రతిఘటిస్తూ తైమూర్‌ను వ్యక్తిగత సిబ్బంది తీసుకెళ్తుండగా... ఇవేమీ పట్టించుకోకుండా.. తన ముద్దు ముద్దు మాటలతో బై అని చెప్పిన వీడియా వైరల్‌ అవుతోంది. 

మరిన్ని వార్తలు