డిజిటల్‌కి డిమాండ్‌

28 May, 2020 03:32 IST|Sakshi
కంగనా రనౌత్‌

లాక్‌డౌన్‌ తర్వాత వ్యక్తిగా, ఆర్టిస్టుగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నారు కంగనా రనౌత్‌. ‘‘లాక్‌డౌన్‌ తర్వాత మన సినిమాలు, వాటి బిజినెస్‌లు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. అసలు ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో కూడా ఇప్పుడే ఊహించలేం. కొన్ని కథలను థియేటర్స్‌లో చూస్తేనే చాలా బాగుంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆలోచిస్తే భవిష్యత్‌లో డిజిటల్‌ మీడియమ్‌కి డిమాండ్‌ పెరిగే అవకాశం కనిపిస్తోంది.

నటిగా నేను సక్సెస్‌ అయ్యాను. సినిమాలు చేస్తున్నాను. నేను కూడా ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించాను. భవిష్యత్‌లో డిజిటల్‌ వైపు వెళ్లేందుకు కూడా సిద్ధంగానే ఉన్నాను. సృజనాత్మకత కలిగిన వ్యక్తిగా నేను సాధించాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉందని నాకు తెలుసు’’ అని పేర్కొన్నారు కంగనా రనౌత్‌. ఇక సినిమాల విషయానికి వస్తే ‘తలైవి’, ‘తేజస్‌’, ‘థాకడ్‌’ అనే మూడు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు కంగనా చేతిలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు