తమన్నా చెప్పిన సీక్రెట్స్

8 Oct, 2015 22:54 IST|Sakshi
తమన్నా చెప్పిన సీక్రెట్స్

 నలుగు పెట్టుకుంటా!
 ఇప్పటికీ అదే మిశ్రమం!
 డైలీ జిమ్‌కెళ్తా!

 దేవుడు తమన్నాని పాలతో తయారు చేశాడా? గులాబీ రేకు సుకుమారాన్ని తమన్నా దేహానికి అద్దాడా? ఏదైనా శిల్పాన్ని చెక్కాలనుకుని ఈ బ్యూటీని తయారు చేశాడా? అని తమన్నా అందాన్ని తెగ వర్ణించాలని కుర్రకారు అనుకోవడం సహజం. దేవుడు ఇచ్చిన ఈ అందాన్ని, శరీరాకృతిని తమన్నా ఎలా కాపాడుకుంటున్నారు? ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అందుకే తమన్నా ఏం చేస్తారో తెలుసుకుందాం...
 
తమన్నా మేని ఛాయ జెనిటికల్‌గా వచ్చింది. ఆమె అమ్మా, నాన్న కూడా తెల్లగా ఉంటారు. వాళ్లకన్నా తమన్నా రంగు ఇంకా ఎక్కువ. చిన్నప్పట్నుంచీ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ వాడే అలవాటు తనకు లేదు. సెనగపిండి, పసుపు పొడి, వేపాకు పొడి.. వీటిని రోజ్ వాటర్‌లో మిక్స్ చేసి అమ్మ ఇచ్చిన మిశ్రమాన్ని మొహానికి అప్లయ్ చేసుకునేది. పెద్దయ్యాక కూడా అదే ఫాలో అవుతున్నారు.

షాంపూలూ అస్సలు వాడరు. హెయిర్ వాష్ కోసం హెర్బల్ పౌడర్స్‌ని వాడతారు. బొప్పాయి, ఉసిరి, శీకాకాయ్‌లతో పొడి తయారు చేసుకుంటారు. అవుట్‌డోర్ షూటింగ్స్ కారణంగా సూర్య రశ్మి బాగా సోకుతుంది కాబట్టి, దాదాపు ప్రతి రోజూ హెయిర్ వాష్ చేసుకుంటారామె.

వీలు కుదిరినప్పుడల్లా ఒంటికి నలుగు పెట్టుకుంటారు. అది కూడా ఇంట్లో తయారు చేసిన పొడులతోనే. నలుగు పెట్టుకోవడం వల్ల మజిల్స్ రిలాక్స్ అవుతాయని అంటారామె.

రాత్రి నిద్రపోయే ముందు మేకప్ క్లీన్ చేసేస్తారు. షూటింగ్స్ లేకపోతే మేకప్ జోలికి వెళ్లరు.

ప్రతి రోజూ జిమ్ కంపల్సరీ. కార్డియో ఎక్సర్‌సైజ్, ఫ్రీ హ్యాండ్ ఎక్సర్‌సైజ్.. ఇలా జిమ్‌లో పలు వ్యాయామాలు చేస్తారు. ఏది చేసినా ట్రైనర్ ఆధ్వర్యంలోనే. జిమ్‌కి కనీసం గంట సేపైనా కేటాయిస్తారు.

ముందు రోజు రాత్రి నానబెట్టిన గుప్పెడు బాదం పప్పులను మర్నాడు ఉదయం తింటారు. ఆ తర్వాత గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగుతారు.

తమన్నాకి పెరుగంటే చాలా ఇష్టం. శరరీం కూల్‌గా ఉండటానికి పెరుగు చాలా ఉపయోగపడుతుందని, కాల్షియమ్ ఎక్కువగా ఉంటుందని ఆమె అంటారు.

రోజు మొత్తంలో సూప్స్, పండ్ల రసాలు, నీళ్లు ఎక్కువగా తాగుతారు. తమన్నా చర్మం మెరవడానికి అదో కారణం.

ఫ్రైడ్ ఫుడ్, టిన్ ఫుడ్స్‌కి దూరంగా ఉంటారు. అప్పటికప్పుడు కుక్ చేసిన ఫుడ్‌నే తీసుకుంటారు. ఆయిలీ ఫుడ్ తినరు.

బేసిక్‌గా తమన్నా సన్నగానే ఉంటారు. కానీ, సినిమాల కోసం ఇంకా సన్నబడ్డారు. అలా సన్నబడటం కోసం తనకు చాలా ఇష్టమైన ఫ్రైడ్ ఫుడ్స్‌ని తాగ్యం చేసేశారు.

అందం కోసం ఎంత చేసినా మానసికంగా ఒత్తిడికి గురైతే మాత్రం అది బయటకు కనిపించేస్తుందంటారు తమన్నా. అందుకే వీలైనంత కూల్‌గా ఉండటానికి ట్రై చేస్తారు.

‘ఎ లాఫ్టర్ ఈజ్ బెస్ట్ టానిక్’ అంటారు తమన్నా. అందుకే పెదాలపై చిరునవ్వు చెరగనివ్వరు.