అభినేత్రిగా అదరగొడుతోంది

4 Jun, 2016 08:58 IST|Sakshi
అభినేత్రిగా అదరగొడుతోంది

తన గ్లామర్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నా.. సక్సెస్ మాత్రం సాధించలేకపోయిన ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా. స్టార్ హీరోలతో వరస సినిమాలు చేసిన ఈ బ్యూటీ భారీ బ్లాక్ బస్టర్లు సాధించిన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఇటీవల బాహుబలి, ఊపిరి సినిమాలతో వరుస విజయాలు సాధించి మంచి ఫాంలో ఉంది ఈ బ్యూటీ. అదే జోరులో ఇప్పుడో ప్రయోగాత్మక చిత్రంతో ఆడియన్స్ ముందుకు వస్తుంది.

ముట్టుకుంటే మాసిపోయేంత అందంగా కనిపించే తమన్నా, పూర్తి డీగ్లామర్ రోల్ లో మెప్పించేందుకు రెడీ అవుతోంది. అభినేత్రి పేరుతో తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఈ ప్రయోగం చేస్తుంది మిల్కీబ్యూటీ. ప్రభుదేవా, సోనూ సూద్ లు ఇరత ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ అతిథి పాత్రలో అలరించనుంది. ఈ సినిమాతో విజయ్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా