అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా

6 Aug, 2019 20:12 IST|Sakshi

తమన్నా సింహాద్రి నోటికి అడ్డూఅదుపు ఉండదని హౌస్‌మేట్స్‌తో పాటు బిగ్‌బాస్‌ చూసే ప్రేక్షకులకు అందరికీ తెలిసే ఉంటుంది. హౌస్‌లో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకే వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలో ఆమెను తీసుకొచ్చారా? అంటూ నెటిజనన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే తమన్నా ప్రవర్తనతో విసుగెత్తిన ఆడియెన్స్‌.. ఆమెను ఈవారం బయటకు పంపించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా తమన్నా ఎలిమినేట్‌ అవడం గ్యారంటీ అంటూ కామెంట్లుపెడుతున్నారు.

అయితే నిన్నటి నామినేషన్‌ ప్రక్రియలో తమన్నా వాగిన చెత్త అందరికీ తెలిసే ఉంటుంది. రవికృష్ణ.. తమన్నాను నామినేట్‌ చేయడంతో మొదలైంది ఈ గొడవ. ఇక అప్పటి నుంచి రవికృష్ణను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయడం మొదలుపెట్టింది. సిగ్గులేదారా?. నువ్‌ మగాడివేనారా?.. పప్పుగాడు అంటూ హౌస్‌లో పిచ్చిపిచ్చి కూతలు కూస్తూ ఉంది. ఇక నుంచి తనెంటో చూపిస్తానని చెప్పిన తమన్నా.. అన్నంత పని చేసినట్టుగానే కనిపిస్తోంది. తమన్నా.. రవికృష్ణను దూషిస్తూ ఉన్న ప్రోమోను తాజాగా విడుదల చేశారు. దీంట్లో రవికృష్ణను అడుగడుగునా తమన్నా టార్గెట్‌ చేసినట్లు కనపడుతోంది. అరేయ్‌ మగాడివేనా? పప్పుగాడు అంటూ మళ్లీ కామెంట్లు చేస్తూ  కనపడుతోంది. మరి రవికృష్ణ సైలెంట్‌గానే ఉన్నాడా? లేక తమన్నాకు గుణపాఠం చెప్పాడా? అన్నది చూడాలి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు

పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’