‘మరో ఐదేళ్ల వరకూ పెళ్లి ఊసే లేదు’

2 Feb, 2019 14:29 IST|Sakshi

బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, దీపిక పదుకోన్‌లు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మరి మీ పెళ్లప్పుడు అంటే నా వయసింకా 29దే.. అప్పుడే పెళ్లేంటే అంటుంది తమన్నా. తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ హిందీలోనూ అడపాదడపా సినిమాలు చేస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో సరైన హిట్‌ చూసి చాలా కాలమైంది తమన్నా. ఒకానొక దశలో ఆమె పని అయిపోయింది. ఇక మూటాముల్లె సర్దుకోవలసిందే అనే కామెంట్లు కూడా బాగానే వినిపించాయి. వీటన్నింటికి గట్టిగానే బదులిచ్చి నటిగా మళ్లీ పుంజుకుంది తమన్నా. తెలుగులో వెంకటేశ్‌తో నటించిన ఎఫ్‌ – 2 చిత్రం సంక్రాంతి బరిలో విజేతగా నిలిచి తమన్నాకు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది.

ఇదేకాక చిరంజీవి తదుపరి చిత్రంలో కూడా తమన్నా నటించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తమిళంలో ప్రభుదేవాతో దేవి – 2 చిత్రంలో నటిస్తోంది తమన్నా. ఉదయనిధిస్టాలిన్‌తో జతకట్టిన ‘కన్నె కలైమానే’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 22న విడుదల కావడానికి సిద్ధం అవుతోంది. తాజాగా నటుడు విశాల్‌తో మరోసారి పనిచేసే అవకాశం వరించిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఫెయిల్యూర్స్‌ ఎక్కువైన సమయంలో పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్‌ అయిపోదామని నిర్ణయానికి వచ్చిన ఈ ఉత్తరాది బ్యూటీ.. మళ్లీ నటిగా కెరీర్‌ రైజ్‌ అవడంతో పెళ్లి ఆలోచనను పక్కన పెట్టిందట. ఇప్పుడు పెళ్లేప్పుడంటే నా వయసింకా 29దేగా అని దీర్ఘాలు తీస్తూ.. మరో ఐదేళ్ల వరకూ పెళ్లి ఊసే లేదు అని కూడా చెప్పేసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు