తమన్నా కాదిక.. ‘సైరా’ లక్ష్మి

3 Oct, 2019 13:35 IST|Sakshi

‘పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దుబిడ్డవవురా.. ఉయ్యాలవాడ నారసింహుడా.. చరిత్రపుటలు విస్మరించ వీలులేని వీరా.. రేనాటిసీమ కన్న సూర్యుడా..’అంటూ ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో వచ్చే పాటకు హీరోయిన్‌ తమన్నా చేసిన ఫెర్ఫార్మెన్స్‌కు అభిమానులు సెల్యూట్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు ఒకటిరెండు మినహా అన్నీ గ్లామరస్‌ పాత్రలకే పరిమితమైన ఈ మిల్కీ బ్యూటీ.. తాజాగా సైరా చిత్రంలో ఓ ఫవర్‌ ఫుల్‌ పాత్రలో కనిపించింది. ప్రతిభ ఉన్న వారికి సరైన అవకాశం దొరికితే ఎలాంటి ప్రదర్శన చేస్తోరో తమన్నా ఈ సినిమాలో నిరూపించింది. దీంతో తమన్నా అభిమానులు తెగ పండగ చేసుకుంటున్నారు. 

‘బాహుబలి’, ‘బద్రీనాథ్‌’వంటి భారీ చిత్రాలలో తమన్నా నటించినప్పటికీ.. ఆమె నటన పెద్దగా ఎలివేట్‌ కాలేదు. అయితే గ్లామరస్‌ పాత్రలతో మాత్రం కుర్రకారును తనవైపు తిప్పేసుకుంది. కానీ సంపూర్ణ నటిగా ఇంకా ఫ్రూవ్‌ చేసుకోలదనే అపవాదు తమన్నాపై ఉండేది. తాజాగా ‘సైరా’ చిత్రంతో ఆ అపవాదును తొలగించుకుంది. సైరా చిత్రంలో తమన్నా ప్రధాన పాత్ర పోషించింది. నరసింహారెడ్డి ప్రియురాలు లక్ష్మిగా చాలా చక్కగా నటించింది.. కాదు జీవించిందనే చెప్పాలి. తన డ్యాన్స్‌లతో, పాటలతో ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్షను రేకెత్తించేలా ఆమె చేసే ప్రదర్శన ఔరా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ చిత్రంలో తమన్నా పాత్ర ముగింపు సినిమాను మలుపు తిప్పుతుంది.  

ఇక ప్రస్తుతం తమన్నా నటనపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. ‘మిల్కీ బ్యూటి కాదిక.. సైరా లక్ష్మి’, ‘తమన్నా నీ నటనకు స్టాండింగ్‌ ఓవియేషన్‌’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘సైరా నరసింహారెడ్డి’బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తొలి షో నుంచే హిట్‌ టాక్‌తో దూసుకపోతున్న ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అంతేకాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ చిత్రంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

చదవండి: సైరా’ ఫుల్ రివ్యూ (4/5)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా