ఆ ఇద్దరూ నాకు దేవుడు లాంటివారు: తమన్నా

25 Nov, 2019 08:14 IST|Sakshi

చెన్నై : ఆ ఇద్దరూ నాకు దేవుడు లాంటివారు అని నటి మిల్కీ బ్యూటీ తమన్నా పేర్కొంది. ఇటీవల అవకాశాలు తగ్గినాయేమోగానీ, ఈ అమ్మడి క్రేజ్‌ మాత్రం ఇంకా తగ్గలేదు. అందుకు కారణం తనను వరిస్తున్న పాత్రలు కావచ్చు, వాటికి తను చేస్తున్న న్యాయం కావచ్చు. ఆ మధ్య బాహుబలి చిత్రంలో అవంతిక పాత్ర అయితేనేమీ, ఇటీవల సైరా నరసింహారెడ్డి చిత్రంలో లక్ష్మీ పాత్ర అయితేనేమీ తమన్నలోని నటిని ఆవిష్కరించాయనే చెప్పాలి. యాక్షన్‌ వంటి కమర్శియల్‌ చిత్రాల్లోనూ నటించడానికి సై అంటున్న ఈ భామ ఇటీవల ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి తిరుచ్చి వచ్చింది. మీడియా ప్రశ్నలకు బదులిచ్చింది. అవేంటో చూద్దాం. 

ప్ర: నటిగా సుదీర్ఘ పయనం గురించి? 
జ: 13 ఏళ్లుగా కథానాయకిగా కొనసాగుతున్నా. ఈ ఏడాది నాకు చాలా సంతోషాన్నిచ్చిందనే చెప్పాలి. నేను నటించిన కన్నే కలైమానే, సైరా నరసింహారెడ్డి, యాక్షన్, పెట్రోమ్యాక్స్‌ తదితర 7 చిత్రాలు తెరపైకి వచ్చాయి. ఒక చిత్రం డిసెంబర్‌లో విడుదల కానుంది. కొత్తకొత్త కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటించడం, అభిమానుల ఆదరణ నన్ను ఇంత కాలం కథానాయకిగా కొనసాగడానికి కారణం 

ప్ర: కొత్తకొత్త నటీమణులు మీకు పోటీగా వస్తున్నారుగా? 
జ:  నేనెప్పుడూ ఎవరినీ పోటీగా భావించలేదు. మరో విషయం ఏమిటంటే కొత్తవారు రావడం చిత్రపరిశ్రమకు మంచిదే. అయినా నేను నటిస్తూనే ఉంటాను. అందుకు వైవిధ్యభరిత కథా పాత్రలను ఎంచుకుని నటిస్తున్నాను. 

ప్ర: ఇటీవల నటుడు కమల్, రజనీలతో కలిసి ఫొటో దిగారు. వారితో నటించాలని కోరుకుంటున్నారా? 
జ: వారి చిత్రాలను నేను ఒక అభిమానిగా చూసి ఆనందిస్తాను. కమల్, రజనీలను నేను చిన్న వయసు నుంచే దేవుళ్లలా చూస్తున్నాను. ఇకపోతే వారితో నటించే అవకాశాన్ని ఎవరు మాత్రం కోరుకోరూ! రజనీకాంత్, కమలహాసన్‌లతో నటించడానికి తగ్గ పాత్రలు లభిస్తే కచ్చితంగా నటిస్తాను. 

ప్ర: కమల్, రజనీ మాదిరిగానే మీకూ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? 
జ: రాజకీయాల్లోకి రావాలంటే వేరే బాధ్యత ఉండాలి. అది నా వల్లకాదు. ప్రజలకు సేవ చేయగలమన్న నమ్మకంతో కమలహాసన్, రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తున్నారు. అంతేకాకుండా వారిపై ప్రజల్లో మంచి అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి వారిద్దరూ ప్రజలకు మంచి చేస్తారని నమ్ముతున్నాను. 

ప్ర:  పెళ్లేప్పుడు? తమిళ వరుడు లభిస్తే చేసుకుంటారా? 
జ: మంచి అబ్బాయి దొరికితే వెంటనే పెళ్లికి రెడీ. మీరే మంచి వరుడిని చూసిపెట్టినా పెళ్లి చేసుకోవడానికి సిద్ధం. 

ప్ర: బాహుబలి, సైరా, ఇలా యాక్షన్‌ చిత్రలనే ఎంచుకుంటున్నట్లున్నారు కారణం? 
జ: నాకు అలాంటి పాత్రలు అమరుతున్నాయి. దాన్ని నేను మార్చలేనుగా! నటించడం మాత్రమే నా పని. సాధారణంగా హీరోయిన్లకు యాక్షన్‌ కథా పాత్రలు లభించవు. అలాంటిది నన్ను వరించడం మంచి మార్పే కదా!  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రణ్‌బీర్‌ మా ఇంటికొచ్చి ఆఫర్‌ ఇచ్చాడు

బ‌న్నీ డ్యాన్స్‌పై బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుమానం

పలు సంస్థలకు గ్లోబల్‌ జంట విరాళాలు

స‌న్నీలియోన్ డ్యాన్స్‌కు పిల్ల‌ల కేరింత‌లు

‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ ఆరోజే..!

సినిమా

బ‌న్నీ డ్యాన్స్‌పై బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుమానం

రణ్‌బీర్‌ మా ఇంటికొచ్చి ఆఫర్‌ ఇచ్చాడు

పలు సంస్థలకు గ్లోబల్‌ జంట విరాళాలు

స‌న్నీలియోన్ డ్యాన్స్‌కు పిల్ల‌ల కేరింత‌లు

‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ ఆరోజే..!

సూర్య సినిమాలో పూజకు ఆఫర్‌!