చిన్నతనంలో ఉండేది, క్రమంగా పోయింది

11 Oct, 2019 08:22 IST|Sakshi

చెన్నై, టీ.నగర్‌: తమన్నా నటించిన పెట్రోమాక్స్‌ తమిళ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా మిల్కీబ్యూటీతో విలేకరులు చిన్న భేటీ..

ప్రశ్న: వరుసగా హర్రర్‌ చిత్రాల్లోనే ఎందుకు నటిస్తున్నారు?
జ: దేవి, దేవి–2 చిత్రాల్లో నటించిన తర్వాత మళ్లీ హర్రర్‌ చిత్రాల్లో నటించేందుకు ఇష్టపడడం లేదని, అయితే ఇది తెలుగులో ఆనందోబ్రహ్మ పేరుతో విడుదలై విజయవంతమైన చిత్రం అన్నారు.

ప్రశ్న: పెట్రోమాక్స్‌ సంభాషణల గురించి తెలుసా?
జ: ఈ సంభాషణల గురించి గౌండమణి, సెంథిల్‌ కామెడీ గురించి రోహిణ్‌ వివరించారు. గౌండమణి సార్‌ను కలిసేందుకు ఆసక్తితో ఉన్నాను. అదింకా జరగలేదు.

ప్రశ్న: మొట్టమొదటి సారిగా సీనియర్‌ రోల్‌లో నటిస్తున్న అనుభవం ఎలా ఉంది?
జ: ఈ చిత్రం నాది కాదు. పోస్టర్‌లో నా ఫొటో ఒక్కటే వేయడాన్ని అంగీకరించను. ఈ చిత్రంలో నటిస్తున్న నటీనటులు, పనిచేస్తున్న టెక్నీషియన్లు అందరూ సమష్టిగా పనిచేశారు. అందుకే అందరి చిత్రం ఇది.

ప్రశ్న: పెద్ద చిత్రాల్లో నటిస్తూ చిన్న చిత్రాల్లో నటించడమెందుకు?
జ: పెద్ద చిత్రం, చిన్న చిత్రం అంటూ వ్యత్యాసం లేదు. మంచి చిత్రంగా ఉండాలి అంతే. కొన్ని చిత్రాలకు ఎక్కువ బడ్జెట్‌ అవసరం కావడంతో అవి పెద్ద చిత్రాలుగా మారుతున్నాయి.

ప్రశ్న: ఇకపై సీనియర్‌ రోల్స్‌లోనే నటిస్తారా?
జ: కథానాయికకు ప్రాముఖ్యత ఉన్న చిత్రాల్లోనే నటించాలని భావించడం లేదు. అన్ని చిత్రాల్లో నటించాలన్నదే ఆశ. ప్రస్తుతం బయోపిక్‌లలో నటించాలనుంది. అందులోను శ్రీదేవి బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే వెంటనే ఒప్పుకుంటాను. ఇది హీరో చిత్రం, హీరోయిన్‌ చిత్రం అని మనమే విభజిస్తూ ఉంటాం. ఈ పంథా మనం మార్చుకోవాలి.

ప్రశ్న: దెయ్యమంటే భయమా?
జ: చిన్నతనంలో ఉండేది, క్రమంగా పోయింది.

ప్రశ్న: మీకు సౌత్‌ ఇండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ అనే బిరుదు ఇవ్వచ్చునా?
జ: మొదటి నుంచి నన్ను మిల్కీబ్యూటీ అంటుంటారు. నాకు తమన్నా అనే మంచి పేరు ఉంది. అది చాలు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా