అలనాటి నటుడు నీలు ఇక లేరు

11 May, 2018 07:53 IST|Sakshi

తమిళ సినిమా(చెన్నై): అలనాటి నటుడు నీలు (82) గురువారం సాయంత్రం మృతిచెందారు. రంగ స్థల నటుడైన ఆర్‌.నీలకంఠన్‌ నాటకాలలో నీలుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో నటించారు. ఈయన 7వేలకు పైగా నాటకాల్లోను, 160 సినిమాల్లోను నటించారు. దివంగత చోరామస్వామి తమ్ముడు అంబితో కలిసి వివేకా ఫైన్‌ ఆర్ట్స్‌ నాటక కంపెనీని ప్రారంభించి నాటకాలు వేస్తూ వచ్చారు. ఈయన నటించిన వాటిలో మహ్మద్‌ బీన్‌ తుక్లక్, ఇంద సుదందిర దాహం వంటివి ప్రముఖమైనవి. క్రేజీ మోహన్‌ నాటకాల్లో కూడా నీలు నటించారు.

ఆయిరం పేయ్‌ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన నీలు పలు చిత్రాల్లో హాస్య భూమికలో నటించి మెప్పించారు. ఈయన నటించిన వాటిలో గౌరవం, అవ్వై షణ్ముగి, కాదలా కాదలా వంటి పలు చిత్రాలు ఈయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఈయన వృద్ధాప్య కారణాలతో గురువారం తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య శాంతా, కుమారులు అర్జున్, భరత్‌ ఉన్నారు. కుమారులు విదేశాల్లో ఉండడం వలన అంత్యక్రియలను శనివారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబీకులు వెల్లడించారు. నీలు మృతికి నడిగర్‌ సంఘం సంతాపం తెలియజేసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు