షూటింగ్‌లో యవ హీరోకు గాయాలు

6 Jan, 2016 09:24 IST|Sakshi
షూటింగ్‌లో యవ హీరోకు గాయాలు

చెన్న: నటుడు శాంతనుకు షూటింగ్‌లో బలమైన గాయాలయ్యాయి. సీనియర్ దర్శకుడు, నటుడు కే భాగ్యరాజ్ కొడుకు,యువ నటుడు అయిన శాంతను ఇటీవలే టీవీ యాంకర్ కీర్తీని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంతకు ముందు సిద్ధు+2  చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన శాంతను తాజాగా కేరళలో చిత్రీకరణ జరుపుకొంటున్న నూతన చిత్ర షూటింగ్‌లో పాల్గొనడానికి భార్య కీర్తితో సహా వెళ్లారు. ఆ చిత్ర ఫైట్ సన్నివేశాల్లో నటిస్తుండగా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయారు. దీంతో ఆయన నుదటి కుడి భాగంలో బలమైన గాయాలయ్యాయి. కాలు ఎముక బెణికింది. తీవ్రంగా బాధపడుతున్న శాంతనును చిత్ర యూనిట్ వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు.

దీని గురించి శాంతను మాటాడుతూ తన ఆరోగ్యం గురించి పరామర్శించిన వారందరికి ధన్యవాదాలు అన్నారు. సినీ స్టంట్ కళాకారులు నిత్యం ఎదుర్కొనే సంఘటన ఇది అన్నారు. జీవనం కోసం ఇంత కఠినంగా శ్రమిస్తున్న వారికి సెల్యూట్ చేస్తున్నానన్నారు.