'కంగనా.. నీకు ఆ అర్హత లేదు'

1 Jul, 2020 08:20 IST|Sakshi

చెన్నై : ‘నీకు ఆ.. అర్హతే లేదు’ అంటూ తమిళ నటి మీరా మిథున్‌ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌పై విరుచుకుపడింది. 8 తూటాకల్‌ తదితర కొన్ని చిత్రాల్లో నటించిన మీరా మిథున్‌ వివాదాస్పద నటిగా ముద్ర వేసుకుంది. ఫ్యాషన్‌ షో నిర్వహించి పలు ఆరోపణలను మూటకట్టుకుంది. ఈమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల బిగ్‌బాస్‌ 3 రియాలిటీ షో లో కూడా పాల్గొని తనదైన ముద్ర వేసింది. ఎప్పుడూ ఏదో అంశంపై స్పందిస్తూ వార్తల్లో ఉండే మీరా తాజాగా బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌పై విమర్శలు గుప్పించి వార్తల్లో నానుతోంది.

నటి  కంగనా రనౌత్‌ దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో టైటిల్‌ పాత్ర  పోషిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈమె ఇటీవల బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య సంఘటనఫై స్పందిస్తూ వారసత్వం తారల ఆధిక్యాన్ని ఖండిస్తూ తీవ్రంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా నటి మీరా మిథున్‌ కంగనా రనౌత్‌ ఫై తీవ్రంగా విమర్శలు చేసింది. అసలు నీకు జయలలిత పాత్రలో నటించే అర్హతే లేదని నటి మీరా మిథున్‌ పేర్కొంది. ఆ పాత్రకు కంగనను ఎంపిక చేయటమే పెద్ద తప్పని అంది. అదే విధంగా నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య వ్యవహారం ఫై అనవసరంగా వ్యాఖ్యలు చేస్తున్నావ్‌.. అంటూ దుయ్యపట్టింది. కాగా, మీరా మిథున్‌ విమర్శలపై నటి కంగన రనౌత్‌ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు