వసుంధరా.. ఏమిటీ ఫొటోల గోల?

30 Dec, 2014 11:57 IST|Sakshi
వసుంధరా.. ఏమిటీ ఫొటోల గోల?

ఇప్పుడిప్పుడే కాస్త వెలుగులోకి వస్తున్న తమిళనటి వసుంధరా కశ్యప్.. తన బోయ్ఫ్రెండుతో కలిసి అభ్యంతరకరమైన రీతిలో ఉన్న ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. వాళ్లిద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీలను.. ఎవరో ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసి అందులో పెట్టేశారు. సుమారు 8-10 ఫొటోలు ప్రస్తుతం వెబ్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాయి. వాటిలో కొన్ని ఫొటోల్లో అయితే.. వాళ్లిద్దరూ మరీ సన్నిహితంగా ఉన్నారని జాతీయ మీడియా గగ్గోలు పెడుతోంది.

ఆర్య సరసన వచ్చిన 'వట్టరం' సినిమాతో తెరంగేట్రం చేసిన వసుంధరా కశ్యప్.. ఇప్పుడిలా కనిపించడంతో అంతా నోళ్లు నొక్కుకుంటున్నారు. తెలుగులో వచ్చిన 'తూనీగ తూనీగ' సినిమాలో హీరోను తరచు ఏడిపించే పాత్రలో కూడా ఆమె నటించింది. తన బోయ్ఫ్రెండుతో కలిసి ఆమె ఉన్న వీడియో కూడా ఆన్లైన్లో లీకైందని సమాచారం. ఇంతకుముందు శింబు - నయనతార లిప్ లాక్ ఫొటోలు , అనిరుధ్ రవిచందర్, ఆండ్రియా ముద్దు పెట్టుకుంటున్న ఫొటోలు కూడా ఇలాగే ఆన్లైన్లో లీకయ్యాయి.