బిగ్‌బాస్‌ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం

19 Aug, 2019 02:35 IST|Sakshi

తమిళసినిమా (చెన్నై) : తమిళ బిగ్‌బాస్‌ హౌస్‌ లో హాస్య నటి మధు మిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమిళంలో ఒరుకల్‌ ఒరు కన్నాడీ చిత్రంలో హాస్య పాత్రలో నటించిన మధుమిత బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో పోటీ చేస్తున్నారు. 50 రోజులకు పైగా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న మధుమిత, కెప్టెన్‌ బాధ్యతలను నిర్వహిస్తున్న తరుణంలో శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆమెను బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు పంపేశారు.

తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌కు కమల్‌ హాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన పాల్గొన్న గత రెండు సీజన్లలో కూడా వివాదాస్పద ఘటనలు జరిగాయి. అయితే హౌస్‌ సభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మధుమిత పేర్కొంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు