ప్రేమికులను విడదీసిన బిగ్‌బాస్‌

22 Aug, 2018 18:40 IST|Sakshi
ప్రేమికురాలు ప్రాచీతో తమిళ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మెహతా (ఫైల్‌ ఫోటో)

చెన్నై : తెలుగు బిగ్‌బాస్‌ హౌస్‌లానే తమిళ బిగ్‌బాస్‌లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళ బిగ్‌బాస్‌ మెహతా - ప్రాచీ అనే ప్రేమ జంటను విడదీసి, మెహతా - యషికా అనే మరో నూతన ప్రేమ జంటను తయారు చేసింది. ఆసక్తికరమైన ఈ ఎపిసోడ్‌ నిన్న ప్రసారం అయ్యింది. నిన్నటి ఎపిసోడ్‌లో మెహతా, యషికాను ప్రేమిస్తున్నట్లు ప్రకటించాడు. అయితే మెహతా బిగ్‌బాస్‌ హౌస్‌కు రాకమునుపే ప్రాచీ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఈ షోకు వచ్చినప్పుడు కూడా ఈ విషయం గురించి చెప్తూ తాను ప్రాచీని బాగా మిస్‌ అవుతున్నానని తెలిపాడు. కానీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చిన తర్వాత మెహతా, హౌస్‌లో మరో కంటెస్టెంట్‌ అయిన యషికాకి దగ్గరయ్యాడు. నిన్నటి ఎపిసోడ్‌లో మెహతా, యషికాను ప్రేమిస్తున్నట్లు తెలిపాడు

మెహతా ఇలా చెప్పడంతో యషికా అభిమానులు ప్రాచీకి తమ సానుభూతిని తెలుపుతూ సోషల్‌మీడియాలో మెసెజ్‌ల మీద మెసెజ్‌లు పెడుతున్నారంట. దాంతో ప్రాచీ, మెహతాతో తన బంధం గురించి క్లారిటీ ఇస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక లేఖను షేర్‌ చేసింది. ఈ లేఖలో ప్రాచీ ‘నేను ఎంతో ప్రేమించిన వ్యక్తిని బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపించాను. మేమిద్దరం కలిసి మా భవిష్యత్‌ గురించి, బిగ్‌బాస్‌ షో గురించి ఎన్నో ప్రణాళికలు రూపొందించుకున్నాం. ఇప్పుడు నా వ్యక్తిగత జీవితం పబ్లిక్‌గా మారిపోయింది. ప్రస్తుతం మెహతా యషికాని ప్రేమిస్తున్నాడనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయం నన్ను బాధపెట్టింది. అయితే ఇప్పుడు నేను మెహతాతో బ్రేకప్‌ చేసుకుంటున్నాను. అతను హౌస్‌ నుంచి బయటకు వచ్చాక ఈ విషయం గురించి అతనితో మాట్లాడతాను. ఇప్పుడు మీ అందరికి నా విన్నపం ఒక్కటే.. ఇక మెహతా గురించి నన్ను అడగడం ఆపేయండి’ అంటూ నెటిజన్లను కోరారు.

గతంలో కమల్‌హసన్‌ మెహతా, యషికాల బంధం గురించి అడగ్గా మెహతా అలాంటిది ఏం లేదని చెప్పడంతో, యషికా కన్నీళ్లు పెట్టిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా