శోకసంద్రంలో దర్శకుడు రాజ్‌కపూర్‌ కుటుంబం

19 Feb, 2020 08:50 IST|Sakshi

సీనియర్‌ దర్శకుడు, నటుడు రాజ్‌కపూర్‌ కుమారుడు షారూఖ్‌కపూర్‌ అనారోగ్యంతో సోమవారం మక్కాలో మృతి చెందాడు. ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. తాలాట్టు కేట్కు దమ్మా, అవ న్‌ వరువాళా, ఆనంద పూంగాట్రు తదితర చిత్రాల దర్శకుడు రాజ్‌కపూర్‌. ఈయనకు భార్య సజీలాకపూర్, కుమారుడు షారూఖ్‌కపూర్, కుమార్తెలు షమీమా, షాని యా ఉన్నారు. కొడుకు షారూఖ్‌కపుర్‌ సోమవారం మక్కాలో అనూహ్యంగా మృతి చెందాడు. ఇతను కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురవ్వడంతో ఆరోగ్యం బాగు అయితే మక్కా కు వస్తామని అతని తల్లి మొక్కుకున్నారట.

షారూక్‌కపూర్‌కు ఆరోగ్యం బాగుపడడంతో రాజ్‌కపూర్‌ భార్య కొడుకును తీసుకుని మక్కా కు వెళ్లారు. అక్కడ వాతావరణం అతి శీతలంగా ఉండడంతో షారూఖ్‌కపూర్‌ ఇంతకు ముందే శ్వాసకోశ సంబంధిత సమస్య ఉండడంతో అనారోగ్యానికి గురయ్యాడు. అయితే వాతావరణ ప్రభావం అని భావించిన అతని తల్లి ఉదారంగా ఉన్నారు. దీంతో షారూఖ్‌కపూర్‌ శ్వాసకోశ సమస్య కారణంగా అనూహ్యంగా సోమవారం మక్కాలోనే కన్ను మూశాడు. దర్శకుడు రాజ్‌కపూర్‌ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనతో సినీ పరిశ్రమ ధిగ్భ్రాంతికి గురైంది. షారేఖ్‌కపూర్‌ మయసు 23 ఏళ్లు. చదువు పూర్తి కాగానే నటనలో శిక్షణ ఇప్పించాలని తండ్రి రాజ్‌కపూర్‌ భావించారట. అయితే చిన్న వయసులోనే షారూక్‌కపూర్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం బాధాకరం.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా