నా కల నెరవేరింది – సూర్య

1 May, 2019 00:00 IST|Sakshi

‘‘నేనింతవరకు ఏ దర్శకుడినీ నాతో ఓ సినిమా చేయండి అని అడిగానో లేదో గుర్తు లేదు కానీ, శ్రీ రాఘవగారిని మాత్రం నాతో ఓ సినిమా చేయమని 2002లో అడిగాను. ఇన్ని సంవత్సరాల తర్వాత నా కల నెరవేరింది’’ అన్నారు సూర్య. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘ఎన్‌.జి.కె’. (నందగోపాలకృష్ణ). సూర్య, సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరో హీరోయిన్లు కాగా, ‘7/జి బృందావన్‌ కాలని’ ఫేమ్‌ శ్రీ రాఘవ దర్శకత్వం వహించారు. ఎస్‌.ఆర్‌. ప్రకాశ్, ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మాతలు. ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. చిత్రబృందంతోపాటు హీరో సూర్య తండ్రి, సీనియర్‌ నటుడు శివకుమార్, 2డి ఎంటర్‌టై మెంట్స్‌ రాజా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ – ‘‘అందరూ ఇది పొలిటికల్‌ డ్రామా, థ్రిల్లర్‌ అనుకుంటున్నారు. ఇది మరో కోణంలో ఉండే సినిమా. 2000 సంవత్సరం తర్వాత దర్శకుడు శ్రీరాఘవ తన దృష్టిలో రాజకీయాలను చూసిన కోణంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్‌లో ప్రతిరోజూ చాలా కొత్తగా అనిపించేది. ఈ సీన్‌ ఇలా తీస్తారేమో అనుకుంటే, ఆయన మరోలా తీసి మెప్పించేవారు. ఆయన మరో కథ ఆలోచిస్తే ఆ కథ నాకే చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను శ్రీరాఘవతో మరో సినిమా చేయాలని ఆశ పడుతున్నాను’’ అన్నారు. శ్రీరాఘవ మాట్లాడుతూ – ‘‘నేను చేసిన సినిమాల్లో ఇది చాలా సంక్లిష్టమైన స్క్రిప్ట్‌.

ఈ దశలో ఈ కథకు ఎవరు సరిపోతారా అని నేను, నిర్మాతలు ప్రకాశ్, ప్రభు ఆలోచించుకుని సూర్య అయితేనే న్యాయం చేస్తారని భావించి చేసిన సినిమా ఇది. సూర్య అద్భుతమైన నటుడు. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషను కూడా చక్కగా ఇచ్చారు. సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ చక్కగా నటించారు. యువ  సంగీతం, శివకుమార్‌ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్‌ ఎడిటింగ్‌ వర్క్‌.. ఇలా ఓ వండర్‌ఫుల్‌ టీం కుదిరింది’’ అన్నారు. ఎస్‌.ఆర్‌. ప్రభు మాట్లాడుతూ– ‘‘ఎ .జి.కె’ విషయంలో చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నాం. తొలిరోజు కథ విన్నప్పుడు ఎంత ఎగ్జయిట్‌ అయ్యామో.. ఇప్పుడూ అదే ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నాం. మే 31న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మన ఆలోచన గ్రౌండ్‌ లెవల్లో ఉంటే శ్రీరాఘవ ఆలోచన ఆకాశం రేంజ్‌లో ఉంటుంది. శ్రీరాఘవగారు ఇ స్టిట్యూట్‌లాంటి వ్యక్తి. నేను ఇప్పటివరకు నేర్చుకున్నది ఏమీ లేదని ఆయనతో సినిమా చేసిన తర్వాతే అర్థమైంది. నాకు ఇప్పటివరకు తెలిసింది అంతా వదిలేసి నటించాలని నేర్చుకున్నాను’’ అన్నారు సాయి పల్లవి. సంగీత దర్శకుడు యువ  శంకర్‌రాజా మాట్లాడుతూ – ‘‘శ్రీరాఘవతో చేసిన ప్రతి సినిమాతో ఏదో ఒకటి బ్రేక్‌ చేస్తూ వచ్చాం. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేస్తున్నాను’’ అన్నారు.  

మరిన్ని వార్తలు