బాలీవుడ్‌ నటుడికి తమిళుల హారతి

7 Jun, 2020 06:59 IST|Sakshi
బాలీవుడ్‌ నటుడికి హారతి పడుతున్న తమిళ మహిళలు

నటుడు సోనుసూద్‌ దక్షిణాదిలో ప్రముఖ నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. కాగా కరోనా కారణంగా ఎందరో ప్రజలు బాధింపునకు గురవుతున్న విషయం తెలిసిందే. దీంతో నటుడు సోనుసూద్‌ ఎందరినో ఆదుకుంటున్నారు. ఈయన కరోనా బాధితుల కోసం ముంబైలోని తన ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను కేటాయించారు. కాగా ఇలాంటి పరిస్థితుల్లో మరెందరో తమిళులు ముంబైలో చిక్కుకుపోయారు.

సొంత ఊళ్లకు ఎలా చేరుకోవాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో వారంతా నటుడు సోనుసూద్‌ను ఆశ్రయించారు. దీంతో ఆయన వారందరినీ విమానంలో సొంత ఊళ్లకు పంపించాలని భావించారు. అయితే అందుకు అనుమతి లేకపోవడంతో ప్రత్యేక బస్సులో పంపడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా శుక్రవారం ఒక బస్సును ముంబై నుంచి తమిళనాడుకు పంపించారు. ముందుగా ఆ బస్సుకు సోనుసూద్‌ కొబ్బరికాయ కొట్టి వారందరినీ సంతోషంగా పంపించారు. దీంతో ఆ తమిళులందరూ హారతి పట్టి కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు