తమిళ స్టార్ డైరెక్టర్ మృతి

12 Dec, 2016 15:01 IST|Sakshi
తమిళ స్టార్ డైరెక్టర్ మృతి

తమిళ, హిందీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కె.సుభాష్ బుధవారం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఎస్ఆర్ఎమ్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ మృతి చెందారు. 1987లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన నాయగన్( తెలుగులో నాయకుడు) సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంబించిన సుభాష్, 1988లో ప్రభు హీరోగా తెరకెక్కిన కలియుగం సినిమాతో దర్శకుడిగా మారారు.

1990లో విజయ్కాంత్ హీరోగా తెరకెక్కిన శత్రియనా ఆయనకు స్టార్ ఇమేజ్ను తీసుకువచ్చింది.తన కెరీర్లో 20 సినిమాలకు దర్శకత్వం వహించిన సుభాష్, చివరగా బాలీవుడ్లో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో ఇన్సాన్ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడిగానే కాక సండే, ఎంటర్టైన్మెంట్, హౌస్ఫుల్ 3, చెన్నై ఎక్స్ప్రెస్ లాంటి చిత్రాలకు రచయితగా కూడా పనిచేశారు.