బాలయ్య అలా అన్సాలింది కాదు: సి. కళ్యాణ్‌

29 May, 2020 14:03 IST|Sakshi

చిరు ఇంట్లో ముగిసిన సీసీసీ రివ్యూ సమావేశం

బాలయ్య వ్యాఖ్యలను తప్పుపట్టిన తమ్మారెడ్డి, సి. కళ్యాణ్‌

త్వరలో మరోసారి సీసీసీ సభ్యుల సమావేశం

సాక్షి, హైదరాబాద్‌ :  మెగాస్టార్‌ చిరంజీవి నివాసంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ(సీసీసీ) సభ్యుల రివ్యూ సమావేశం ముగిసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులు, పేద సినీ కార్మికులకు అందిన సాయం, లోట్లుపాట్లపై సీసీసీ సభ్యుల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సమావేశం అనంతరం దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడారు. ఇటీవల సినీ పెద్దలు ప్రభుత్వంతో జరిపిన చర్చలపై నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. (భూములు పంచుకుంటున్నారా?)

‘ఎవరి ఇంట్లో పెళ్లి కాదు, బొట్టు పెట్టి పిలవడానికి. పలానా వాళ్లని పిలవాలి అనేది లేదు నన్ను కూడా పిలవలేదు. ఈ విషయాన్ని ఇంత పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదు. మహేశ్‌, వెంకటేశ్‌, ఇలా చాలా మందిని పిలువలేదు. మమ్మల్ని పిలవలేదు అంటే అర్థం లేదు. బాలకృష్ణ, నాగబాబు వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం. ఆ వ్యాఖ్యలతో చిత్రపరిశ్రమకు సంబంధంలేదు. ఇప్పటివరకు నిర్మాతలుగా మేము చిత్రీకరణ కోసం ప్రభుత్వంతో సంప్రదిస్తున్నాము. ఈ సమావేశానికి చిరంజీవి, నాగార్జునలను లీడ్‌ తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.  బాలయ్య లేకుండా సినీ ఇండస్ట్రీ ఉందనుకోవడం లేదు. ఆయన అవసరం ఉన్నప్పుడు తప్పకుండా పిలుస్తాం’ అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. (బాలకృష్ణకు ఇక్బాల్‌ గట్టి కౌంటర్‌!)

బాలయ్య అలా అనాల్సిందికాదు: సి.కళ్యాణ్‌
‘ఈ రోజు చిరంజీవి ఇంట్లో సీసీసీ రివ్యూ మీటింగ్‌ సజావుగా జరిగింది. పలు విషయాలపై చర్చించాము. ఇక ప్రభుత్వంతో సినీ పెద్దలు జరిపిన సమావేశం రియల్‌ఎస్టేట్‌ సమావేశం అని ఎందుకు అన్నారో తెలియదు. అయితే బాలయ్య ఆలా అన్సాలింది కాదు.  సమావేశానికి చిరంజీవి, నాగార్జునలను లీడ్‌ చేయమని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఆందుకే వాళ్లు సమావేశానికి వచ్చారు. ఇప్పటివరకు నిర్మాతలు, దర్శకులు మాట్లాడుకునే సమావేశాలే జరిగాయి’ అని నిర్మాత సి. కళ్యాణ్‌ వివరించారు. 

మరిన్ని వార్తలు