తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా

23 Jul, 2019 03:50 IST|Sakshi
తమ్మారెడ్డి భరద్వాజ

‘‘ఆమె’ సినిమాకి మంచి పేరు వచ్చింది.. కానీ, కలెక్షన్లు ఆశించిన రీతిలో రాలేదు. కలెక్షన్లు రాకపోవడంతో అన్యాయం జరిగిందని చెప్పడం లేదు’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అమలాపాల్‌ లీడ్‌ రోల్‌లో రత్నకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం‘ఆడై’. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో రాంబాబు కల్లూరి, విజయ్‌ మోరవనేని ‘ఆమె’ పేరుతో ఈ నెల 20న తెలుగులో విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘తమిళ నిర్మాతలకు నెల కిందటే ‘ఆమె’ కోసం డబ్బులు చెల్లించాం.

తమిళనాడులోని డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇచ్చారు. అయితే ఫైనాన్షియర్లకు నిర్మాతలు డబ్బు కట్టలేదు. చివరకు అమలాపాల్‌ తన రెమ్యునరేషన్‌ వెనక్కి ఇవ్వడంతో పాటు ఎదురు డబ్బులు ఇచ్చి విడుదల చేయించింది. ముందుగా అనుకున్నట్లు 19న విడుదలైతే బాగుండేదేమో? ఒక రోజు ఆలస్యంగా విడుదల కావడం వల్ల క్రేజ్‌ తగ్గిపోయి మా చిత్రం చచ్చిపోయింది. అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్‌ అవుతున్న సినిమా చంపేయబడింది. సరైన విడుదల తేదీ, థియేటర్లు దొరక్క చాలామంది నష్టపోతున్నారు.

నాకు దొరికినా తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా. దీనిపై తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌లో కేసు పెట్టా. ఓ మంచి సినిమా తీయడం ఎంత ముఖ్యమో దాన్ని పద్ధతిగా విడుదల చేయడం కూడా అంతే ముఖ్యమనే పాఠాన్ని ‘ఆమె’తో నేర్చుకున్నా. ఇక ఈ సినిమా విషయానికొస్తే... నేటితరం ఆవేశంలో, మద్యం మత్తులో విసిరే సవాళ్లు ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తాయనే విషయాన్ని అసభ్యత లేకుండా తీశాడు దర్శకుడు. అమలాపాల్‌ బాగా నటించింది. ‘మల్లేశం, ఆమె’ లాంటి సినిమాలను ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ముద్దులు పెడితే సినిమాలు నడుస్తాయా?

సూర్యకు నటన రాదనుకున్నా!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘22’ షురూ..

రూ 100 కోట్ల క్లబ్‌లో సూపర్‌ 30

‘సైరా’దర్శకుడు మెచ్చిన ‘మథనం’

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4

దుమ్ము రేపనున్న ‘సాహో’ క్లైమాక్స్‌!

తెలుగు బిగ్‌బాస్‌పై పిటిషన్‌: హైకోర్టు విచారణ

ప్రామిస్‌.. మీ అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తా: శ్రీముఖి

బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు

భార్య కంటే కత్తి మంచిది

పిల్లల సక్సెస్‌ చూసినప్పుడే ఆనందం

కొంటె పిల్లడు.. గడసరి అమ్మడు

కొత్త కథల్ని ఆదరిస్తున్నారు

వాట్‌ నెక్ట్స్‌?

ఇక్కడ దీపిక.. అక్కడ మెరిల్‌

మొదటిరోజే హౌస్‌మేట్స్‌కు షాక్‌!

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా

ముద్దులు పెడితే సినిమాలు నడుస్తాయా?

సూర్యకు నటన రాదనుకున్నా!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌