మీరు కూడా చూడకపోతే మీ ఖర్మ: తమ్మారెడ్డి

7 Mar, 2020 17:35 IST|Sakshi

‘పలాస 1978’  థాంక్స్ మీట్‌లో తమ్మారెడ్డి ఫైర్‌

దళిత సమస్య లపై ఒక మంచి చిత్రం తీస్తే దళితులే పట్టించుకో పోతే ఎలా..? 

‘ఒక మంచి సినిమా కావాలి అంటారు..మంచి రివ్యూలు కావాలి అంటారు..అవన్నీ ఉన్న సినిమా పలాస 1978. దళితుల పాత్రలు  సినిమాల్లో ఉండవు. దళిత కథలు సినిమాగా మారవు అంటారు. కానీ పలాసలో వారి పాత్రలను హీరో లను చేసాము. వారి సమస్యలను చర్చించాం. కానీ వారి నుండే స్పందన కరువైంది’ అని తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. ‘మీ సినిమాలు మీరు కూడా చూడకపోతే మీ ఖర్మ. మీరు చూసి ఆశీర్వదిస్తే..మరిన్ని సినిమాలు వస్తాయి. ఇది నా ఆవేదన. నా నలభై ఏళ్ల కెరియర్‌లో ఏ సినిమా ఆడినా, అడకపోయినా బాధ పడలేదు. కానీ ఈ సినిమా విషయంలో మేము సక్సెస్ అయ్యాం. అయితే ఈ సినిమా మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత దళితులదే’ అని అన్నారు. (‘పలాస 1978’ మూవీ రివ్యూ) 

కాగా రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’.. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరిన్ని వార్తలు