తాన్హాజీ: యుద్ధానికి భయపడేదే లేదు

19 Nov, 2019 15:55 IST|Sakshi

చలనచిత్ర పరిశ్రమలో గతకొంతకాలంగా బయోపిక్‌ల హవా నడుస్తోంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా బయోపిక్‌ సినిమాలు ప్రేక్షకుల మెప్పును సంపాదించుకుంటున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో వస్తున్న బయోపిక్‌ చిత్రాలకు లెక్కే లేదు. ఈ క్రమంలో మరాఠా అధినేత చత్రపతి శివాజీ సామ్రాజ్యంలో సుబేదార్‌గా పనిచేసిన మరాఠా యోధుడు తానాజీ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘తాన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’. ఈ సినిమాలో అజయ్‌ దేవ్‌గన్‌, కాజోల్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ నేడు రిలీజైంది. యుద్ధ సన్నివేశాలతో కూడిన ఈ ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

తానాజీ యుద్ధ సన్నివేశాలు భీకరంగా ఉండేట్టు కనిపిస్తోంది. 1670 వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యంలో లిఖించబడిన చరిత్రను చిత్రబృందం వెండితెరపై ఆవిష్కరించింది. తానాజీ మొఘల్‌ సామ్రాజ్యంపై సర్జికల్‌ స్ట్రైక్‌ జరిపాడంటూ ట్రైలర్‌లో ఆయన ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఈ ట్రైలర్‌లో కాజోల్ నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ ఆమె నటన ఆకట్టుకుంది. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు అదనపు ఆకర్షణగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. భయం అంటేనే తెలియని తానాజీ ప్రత్యర్థి (సైఫ్‌ అలీఖాన్‌)తో యుద్ధానికి సై అంటూ చెప్పే డైలాగులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌లతో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా