తనుశ్రీ దత్తా వివాదం : అజ్ఞాతంలోకి నటుడు

29 Sep, 2018 10:10 IST|Sakshi
నానా పటేకర్‌ - తనుశ్రీ దత్తా (ఫైల్‌ ఫోటో)

తనుశ్రీ దత్తా, నానా పటేకర్‌ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. నానా పటేకర్‌పై తనుశ్రీ చేసిన లైంగిక ఆరోపణలకు బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఒక్కొక్కరు మద్దతు ఇస్తున్నారు. ట్వింకిల్‌ ఖన్న, సోనమ్‌ కపూర్‌, ప్రియాంక చోప్రా. అర్జున్‌ కపూర్‌, సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, ఫర్హాన్‌ అక్తర్‌లు తనుశ్రీకి సపోర్టుగా నిలిచారు. ప్రస్తుతం హౌజ్‌ఫుల్‌ 4 లో నటిస్తున్న నానా పటేకర్‌ షూటింగ్‌ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ హౌజ్‌ఫుల్‌ 4 సినిమా సందర్భంగా చిత్ర యూనిట్‌ సభ్యులంతా గురువారం జైసల్మేర్ బయలుదేరి వెళ్లారు. అలా వెళ్లిన యూనిట్‌ సభ్యులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నానా పటేకర్‌ మిస్సయ్యారు. ఆయన ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

ఎక్కడికి పోయారో తెలియదు, నానా పటేకర్‌ షూటింగ్‌ రానట్టు తెలిసింది. కనీసం చిత్ర యూనిట్‌కు కూడా ఆయన ఎక్కడికి వెళ్లారు చెప్పలేదు. దీంతో పటేకర్‌ సీన్లను తర్వాత షూట్‌ చేయాలని చిత్ర యూనిట్‌ నిర్ణయించిందని రిపోర్టులు తెలిపాయి. హౌజ్‌ఫుల్‌ 4 సినిమా షూటింగ్‌ సందర్భంగా జైసల్మేర్ బయలుదేరు వెళ్లు సమయంలో, నానా పటేకర్‌, కృతి సనూన్‌, పూజే హెగ్డేలతో కలిసి ఉన్న ఓ పిక్చర్‌ను ఫర్హాన్‌ అక్తర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లిన తర్వాత నానా పటేకర్‌ మిస్సయ్యారు. 

2009లో వచ్చిన ‘హార్న్‌ ఒకే ప్లీజ్‌’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ ‌తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలన్నీ నిరాధారనమైనవని, సెట్‌లో 50 నుంచి 100 మంది వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఎలాంటి లైంగిక ఆరోపణల గురించి ఆమె మాట్లాడుతుంది అంటూ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. కాగా, సాజిద్‌ ఖాన్‌ కామెడి సినిమా హౌజ్‌ఫుల్‌ 4లో నానా పటేకర్‌ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా