పోలీసులకు డాక్యుమెంట్లు సమర్పించిన తనుశ్రీ

10 Oct, 2018 15:56 IST|Sakshi
బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : పదేళ్ల కిందట ఓ సినిమా డ్యాన్స్‌ సీక్వెన్స్‌ షూటింగ్‌ సందర్భంగా నటుడు నానా పటేకర్‌ తనను లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపించిన నటి తనుశ్రీ దత్తా బుధవారం తన ఫిర్యాదుకు మద్దతుగా 40 పేజీల డాక్యుమెంట్లను ముంబై పోలీసులకు సమర్పించారు. తనుశ్రీ దత్తా న్యాయవాది ఒషివరా పోలీస్‌ స్టేషన్‌తో పాటు రాష్ట్ర మహిళా కమిషన్‌కూ ఈ పత్రాలను అందచేశారు.

2008లో జరిగిన ఈ ఘటనపై అప్పట్లో తనుశ్రీ తండ్రి తపన్‌ కుమార్‌ దత్తా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. అప్పటి ఫిర్యాదు వివరాలు సైతం ఈ పత్రాల్లో పొందుపరిచారు. డ్యాన్స్‌ సీక్వెన్స్‌ షూటింగ్‌ రద్దైన క్రమంలో కొందరు పాత్రికేయులు తమ కార్లపై దాడి చేసి ధ్వంసం చేశారని అప్పట్లో తనుశ్రీ దత్తా తండ్రి ఫిర్యాదు చేసిన ఆధారాలు ఈ పత్రాల్లో ఉన్నాయి.

అయితే నానా పటేకర్‌పై తాను చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఈ పత్రాల్లో ప్రస్తావన లేదు. కాగా 2008లో హార్న్‌ ఓకే ప్లీజ్‌ మూవీలో డ్యాన్స్‌ సీక్వెన్స్‌ షూటింగ్‌ నేపథ్యంలో నానా పటేకర్‌ తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. తనపై ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనుశ్రీ దత్తాకు నానా పటేకర్‌ లీగల్‌ నోటీసులు పంపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

కరోనా విరాళం

సినిమా

మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు